ప్లీజ్.. ఎవరైనా రైనాను వెనక్కు తీసుకురండి

IPL 2020లో సురేశ్ రైనా కొరత కనిపిస్తుందని..మూడు సార్లు చాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జట్టులోకి రైనాను తీసుకురావాలని అభిమానులు వేడుకుంటున్నారు. ఏడు గేమ్స్ లో ఐదింటిని కోల్పోయిన సీఎస్కే పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది.




టోర్నమెంట్ ఆరంభంలో ఊహించినంతగా చెన్నై చేయలేకపోతుంది. శనివారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నైపై 37 పరుగుల తేడాతో గెలిచింది. 52బంతుల్లో 90పరుగులు చేసి కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడాడు. ఫలితంగా చెన్నై టీంకు 169పరుగుల టార్గెట్ నిర్దేశించారు.

చేజింగ్ లో సీఎస్కే విఫలం కావడంతో.. ఓటమి తప్పలేదు. అంబటి రాయుడు మునిగే నౌకను కాపాడాలని ప్రయత్నించినా సరైన పార్టనర్ దొరక్క జట్టు ఓడిపోయింది.




20ఓవర్లు ఆడిన సీఎస్కే 132పరుగుల అతి కష్టంపై చేయగలిగింది. 37పరుగుల తేడాతో ఓడి ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయాల్ని తట్టుకోలేకపోతున్న సూపర్ కింగ్స్ అభిమానులు రైనాను వెనక్కు తీసుకురావాలని అడుగుతున్నారు. రైనా టోర్నీ ఆరంభంలో యూఏఈ వెళ్లినా.. కొద్ది రోజుల్లోనే పర్సనల్ రీజన్స్ తో వెనక్కు వచ్చేశాడు.

రైనా వైస్ కెప్టెన్ మాత్రమే కాకుండా చెన్నై లీడ్ రన్ స్కోరర్లో ఒకరు. అతని ఇన్నింగ్స్ కు కొన్నిసార్లు మిస్టర్ ఐపీఎల్ అని కూడా ట్యాగ్ పెట్టారు. ఇంకొక రెండు మ్యాచ్ లు ఓడిపోతే ధోనీసేన ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే.