sunrisers-hyderabad-beat-rajasthan-royals : టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వార్నర్‌సేన రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు రాజస్థాన్ ఏడో ఓటమితో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.
https://10tv.in/ipl-2020-playoffs-qualification-scenario-what-do-csk-kxip-rr-srh-need-to-finish-in-top-4/
గత మ్యాచ్‌లో కోల్‌కతా పేసర్ లూకీ ఫెర్గూసన్ ధాటికి విలవిల్లాడి సూపర్ ఓవర్‌లో ఓడిన హైదరాబాద్.. ఈ సారి సమిష్టిగా రాణించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మనీశ్ పాండే 83 రన్స్‌తో అజేయంగా నిలవగా… విజయ్ శంకర్ 52 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.
ఈ ఇద్దరి విజృంభించడంతో వార్నర్ సేన ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మరో 11 బాల్స్ మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మనీశ్ పాండేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 154 పరుగులే చేసింది. రాబిన్ ఉతప్ప 19 పరుగులు చేసి ఔటయ్యాడు. బెన్‌స్టోక్ , సంజూ శాంసన్ ఆచితూచి ఆడారు. ఈ ఇద్దరినీ జేసన్ హోల్డర్, రషీద్‌ఖాన్ ఔట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన బట్లర్ నిరాశపర్చాడు. ఇక కెప్టెన్ స్మిత్ కూడా 19 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ మెరవడంతో జట్టు స్కోరు 150 దాటింది.