Chakravarthy Warrier Positive For Covid 19 Kkr Vs Rcb Rescheduled
IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మ్యాచ్ కు ఆటంకం వచ్చి పడింది. దీంతో కోల్ కతాకు బెంగళూరుకు మధ్య జరగాల్సి ఉన్న మ్యాచ్ వాయిదా వేశారు.
కోల్ కతా ఫ్రాంచైజీకి చెందిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, బౌలర్ సందీప్ వారియర్ లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. రీసెంట్ గా ఐపీఎల్ బయో బబుల్ దాటి అధికారికంగా గ్రీన్ ఛానెల్ లోకి అడుగుపెట్టాడు.
జట్టు మొత్తానికి కరోనా టెస్టులు చేయించడంతో కేవలం వరుణ్, వారియర్ మాత్రమే పాజిటివ్ గా తేలింది. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న వ్యక్తులకు కొవిడ్ పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. దీనిపై ఫ్రాంచైజీతో పాటు ఐపీఎల్ నిర్వాహకులు కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మొదటి ఏడు మ్యాచ్ లలో కేవలం రెండింటిలోనే గెలిచింది. చివరిగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడింది. టాపార్డర్ నిలదొక్కుకోలేకపోవడం, విదేశీ ప్లేయర్ల కాంబినేషన్ కుదరకపోవడం సమస్యగా మారింది.