Ms Dhoni
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసుకుంది. ఓటమెరుగకుండా దూసుకెళుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. దీంతో ధోనీసేన ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 8పాయింట్లు సంపాదించి టాప్‌కు చేరిపోయింది.
ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరుగుతుండగా ఎప్పటిలాగే ధోనీ జట్టు సహచరులకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా ఆరు సిక్సులు, ఒక ఫోర్ తో చెలరేగిపోగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న ధోనీ సపోర్టింగ్ గా నిలిచాడు.
గట్టి టార్గెట్ నే ఇచ్చినప్పటికీ ధోనీ స్టంప్స్ వెనుకే ఉండి.. చెన్నై బౌలర్లకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ ఫన్నీ ఘటన జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ చేస్తుండగా.. ధోనీ.. జడేజాకు ఇలా సలహా ఇచ్చాడు.
Dhoni the tactician and his ability to read someone's game >>>>>>>pic.twitter.com/uFGyXdn3Nz
— Bhavya (@BhavyaDhoni) April 26, 2021
దండే పర్ రఖ్.. కొట్టనివ్వు (బ్యాట్ ను టార్గెట్ చెయ్.. బంతి కొట్టనివ్వు) అని చెప్పాడు. సూచనలు ఫాలో అయిన జడేజా వేసిన బంతికి మ్యాక్స్ వెల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. మరోసారి జడేజాకు సూచనలిచ్చేందుకు తాను ఇంగ్లీషులో మాట్లాడలేనంటూ.. ‘హిందీలో మాట్లాడటం కుదరని పని’ అని కామెంట్ చేశాడు.
ఈ మాటలన్నీ అక్కడి స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఏదైతేనేం ఐపీఎల్ 2021లో 19వ మ్యాచ్ ను చెన్నై 69పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ప్రస్తుత సీజన్లో బెంగళూరుకు తొలి ఓటమి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ధోనీ సేన 191పరుగులు చేయడంతో.. బెంగళూరు 9వికెట్లు నష్టపోయి కేవలం 122పరుగులు మాత్రమే చేయగలిగింది.