How Did That Happen Former Cricketers Shocked After Kkr Fail To Score 31 Off 30 Balls
IPL 2021- KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ను చేజాతులురా చేజార్చుకుందని దారుణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ ఓవర్ తర్వాత ఇంకా 30బంతులు ఉండగా.. 31 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది. ఆ తర్వాత రస్సెల్, దినేశ్ కార్తీక్ క్రీజులో ఉండగా 28బంతుల్లో 31పరుగులుగా కన్పించింది టార్గెట్.
కాకపోతే క్షణాల్లో పరిస్థితి మారిపోయి అంకెల్ తారుమారయ్యాయి. కార్తీక్ అజేయంగా చివరి వరకూ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఫలితంగా జట్టు 10 పరుగుల తేడాతో పరాభవాన్ని నెత్తినేసుకుంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రాలు షాక్ అయ్యామంటున్నారు. ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్ ఓడిపోవడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.
15వ ఓవర్ వరకూ కంట్రోల్ ఉన్న కేకేఆర్ టీం.. ఒక్కసారిగా కుదేలు అయింది. క్రీజులో రస్సెల్, కార్తీక్ లు ఉన్నారు. ఆ సమయంలో ముంబై స్పిన్నర్ల తర్వాత బౌల్ట్, బుమ్రాలను దింపింది. చివరి ఓవర్ లో 15పరుగులు కావాల్సి ఉన్నాయి. ఆ సమయంలో బౌల్ట్ .. రస్సెల్, కమిన్స్ ను వరుస బాల్స్ తో అవుట్ చేశాడు. అంతే మ్యాచ్ అయిపోయింది.
అంతకంటే ముందు టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇయోన్ మోర్గాన్ కెప్టెన్సీలో గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై మ్యాచ్ గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ లో కోల్కత్తా 10పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ ను ఏప్రిల్ 18న చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
‘పిచ్‌తో సంబంధం లేకుండా ముంబై బాగా ఆడి కోల్‌కతాకు భారీ టార్గెట్ నిర్దేశిస్తుందనుకున్నా. చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఇది’ అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
More than the pitch I though nerves got the better of KKR in the run chase. Should have won this one easily. #IPL2021
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 13, 2021
ముంబై నుంచి కోల్‌కతా వరకూ చూశారా.. మీ అజాగ్రత్త. 7వికెట్లు చేతిలో ఉన్నాయి. 30బంతుల్లో 31 పరుగులు చేయాలి. అయినా అదేం ఆట’ అని వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్ వేశారు.
MI to KKR- Dekha aapne laparwahi ka.natija.
To defend 31 from 30 balls with 7 wickets of the opposition in hand is something which not many sides can defend. Brilliant bowling display from @mipaltan .#MIvsKKR pic.twitter.com/dIdd603wKL— Virender Sehwag (@virendersehwag) April 13, 2021
‘అదెలా జరిగింది. కేవలం 30బంతుల్లో 31పరుగులు చేయాల్సి ఉన్న మ్యాచ్. 10పరుగుల తేడాతో ఓడిపోయిందా. అప్పటికీ మూడు వికెట్లు మిగిలే ఉన్నాయి. మళ్లీ రస్సెల్ రెండు క్యాచ్ లు కూడా మిస్ చేశారు. ఇన్‌క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ లో మరో చమత్కారపు ఫలితం. అంటూ ట్వీట్ చేశాడు ఆకాశ్ చోప్రా.
How did that just happen? Needed 31 off 30 balls. Lost by 10 runs with three wickets still in the hut. In between, #MI dropped Russell twice. Incredible Premier League has given us yet another freakish result. #KKRvMI #IPL2021
— Aakash Chopra (@cricketaakash) April 13, 2021