IPL 2021: మరో 3 రోజుల్లో మ్యాచ్ జరగాల్సిన స్టేడియం సిబ్బంది 13మందికి కొవిడ్ పాజిటివ్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్..

IPL 2021: మరో 3 రోజుల్లో మ్యాచ్ జరగాల్సిన స్టేడియం సిబ్బంది 13మందికి కొవిడ్ పాజిటివ్

Cricket Stadium

Updated On : May 18, 2021 / 2:23 PM IST

IPL 2021: ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్ కు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ఆ తర్వాత మ్యాచ్ ను ముంబైలోని వాంఖడే వేదికగా నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 10న జరగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా.. స్టేడియం సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో పది మంది పాజిటివ్ వచ్చినప్పటికీ తాజాగా మరో మూడు కేసులు నమోదవడంతో స్టేడియం మేనేజ్మెంట్ అప్రమత్తమై చర్యలు చేపట్టింది.

వ్యాప్తిని అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. టీమ్స్ ను హోటల్స్ కు అనుమతించి ప్రాక్టీస్ చేసేందుకు మాత్రమే సహకరిస్తున్నారు. మంగళవారానికి మహారాష్ట్రలో మొత్తం 47వేల కరోనా కేసులు నమోదయ్యాయి.