Second Part Of My Innings Was The Best I Ever Played Sanju Samson
Sanju Samson: సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్తున్నాడు. ముంబై వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో 63బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులు కలిపి 119 పరుగులు చేశాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కు ఓటమి తప్పలేదు.
దీనిపై స్పందించిన శాంసన్.. నా కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడానని చెప్పాడు. ప్రతిసారీ ఇలా జరగకపోవచ్చు. కాకపోతే బౌలర్లకు అనుగుణంగా సింగిల్స్ తీసుకుంటూ సెకండాఫ్ లో సమయాన్ని బట్టి షాట్స్ బాదేశా’ అని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలోమాట్లాడాడు.
ఆ షాట్స్ ఆడటం బాగా ఎంజాయ్ చేశా. నా స్కిల్స్ మీద బాల్ తో ఫోకస్ చేసి రియాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అలా జరుగుతుంది. కొన్నిసార్లు వికెట్ కోల్పోవచ్చు కానీ, నేను అలాగే ఆడతాను’ అని తన సామర్థ్యాలను ఎలా నమ్ముతాననే దానిపై చెప్పుకొచ్చాడు.
ఆ రాత్రి అలా చేశా. టాస్ వేసినప్పుడు కాయిన్ చూసి చాలా మంచిగా అనిపించింది. ఇది నేను ఉంచుకోవచ్చా అని రిఫరీని అడిగా. దానికి అతను నో చెప్పాడు. అని సంజూ టాస్ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ఫైనల్ బాల్ వరకూ ఆడిన శాంసన్ జట్టును గెలిపించేందుకే ప్రయత్నించాడు.
చెప్పడానికి మాటలు రావడం లేదు. గేమ్ అంత బాగా ఆడతానని అనుకోలేదు. ఇంతకంటే బాగా ఆడతానో కూడా తెలీదు. అని అంటున్నాడు శాంసన్. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం తాను జట్టుపై నమ్మకం కోల్పోలేదని చివరి వరకూ గెలిచేందుకే ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు.