NEET UG 2026 : 27న నీట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే..
NEET UG 2026 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నీట్ (NEET UG) 2026 అడ్మిట్ కార్డుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
- Harishth Thanniru
- Published on- April 26, 2026 / 02:30 PM IST
NEET UG 2026
NEET UG 2026 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నీట్ (NEET UG) 2026 అడ్మిట్ కార్డుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం.. 26వ తేదీనే విడుదల కావాల్సిన అడ్మిట్ కార్డులు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా.. NTA కీలక ప్రకటన చేసింది. నీట్ యూజీ -2026కు సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని నీట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NEET Admit Cards will be available to all candidates by 10 AM on Monday, 27th April 2026.
Use the last Sunday before the exam for a practice test or revising concepts.
Stay Calm. Keep yourself hydrated. #NEET2026
— National Testing Agency (@NTA_Exams) April 26, 2026
డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే..
♦ విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.
♦ అక్కడ కనిపించే ‘అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్ (Admit Card PDF)’ లింక్‌పై క్లిక్ చేయాలి.
♦ ఆ తరువాత మీ అప్లికేషన్ నంబర్ (Application Number), పాస్‌వర్డ్ (Password) వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
♦ ఈ వివరాలు ఇచ్చిన వెంటనే నీట్ హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
♦ ఆ పీడీఎఫ్‌ను సేవ్ చేసుకుని, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు తప్పనిసరిగా ఒక ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
పరీక్ష వివరాలు..
మే 3వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఒకే షిప్ట్ లో పరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా 552 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నీట్ 2026 ప్రశ్నాపత్రం మొత్తం 180 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) నుంచి 45, రసాయ శాస్త్ర (కెమిస్ట్రీ) నుంచి 45, జీవశాస్త్ర (బయాలజీ) నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులకు కేవలం 180 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది.
