మందుబాబులకు షాక్…మద్యం షాపులు క్లోజ్

  • Publish Date - May 9, 2020 / 12:32 AM IST

ఓపెన్ చేసి వారం రోజులు కాలేదు..మళ్లా క్లోజ్..ఎందుకు ? మళ్లా ఏమైంది ? కరోనా కేసులు ఎక్కువయ్యాయా ? అసలు లిక్కర్ షాపులు ఎక్కడ బంద్ అయ్యాయి ? అనేగా మీ ప్రశ్నలు. కానీ బంద్ అయ్యాయనే విషయం వాస్తవం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ముంబైలో. మందుబాబులు చూపిన అత్యుత్సాహం..నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు పై విధంగా నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించింది కేంద్రం, దాదాపు 40 రోజుల తర్వాత..కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా లిక్కర్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చని, కానీ కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ముంబై లో కూడా షాపులు తెరుచుకున్నాయి. మందుబాబులు మొదటి నుంచి బారులు తీరి నిలుచుకున్నారు. బాటిళ్లు దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. భౌతికదూరం పాటించాలనే నిబంధన పాటించలేదు. అంతేగాకుండా కరోనా వైరస్ మరింత విస్తృతమైంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోలేదు.

చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం, పలు ప్రాంతాల్లో జనాలను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. పోలీసులు, అధికారుల నుంచి ఈ మేరకు సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ పర్దేశీ వెల్లడించారు. దీని కారణంగా లిక్కర్ షాపులు మూసివేస్తున్నట్లు, నిత్యావసర వస్తువులు, మెడికల్‌ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయన్నారు. 

మరోవైపు..ముంబైలో 510 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9 వేలు దాటిపోయింది. ఇక మహారాష్ట్రలో 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా వైరస్ కారణంగా..34 మంది మరణించారు.

Read More:

Liquor Home Delivery గురించి రాష్ట్రాలు ఆలోచించాలి: సుప్రీం కోర్టు

మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు సూచనలు