12Th Student: ఆమెను చీరలో చూడాలి.. మోడీ సార్ అనుమతివ్వండి ప్లీజ్!

గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్.. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్. పెన్ను పేపర్ లేకుండానే టెన్త్, ఇంటర్ వరకు పిల్లలంతా పాసైపోయారు. గత ఏడాది గంప గుత్తగా దేశమంతటా పరీక్షలు రద్దు చేయగా ఈ ఏడాది మాత్రం ఇంకా కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు వాయిదాలో ఉన్నాయి.

Modi

12Th Student: గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్.. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్. పెన్ను పేపర్ లేకుండానే టెన్త్, ఇంటర్ వరకు పిల్లలంతా పాసైపోయారు. గత ఏడాది గంప గుత్తగా దేశమంతటా పరీక్షలు రద్దు చేయగా ఈ ఏడాది మాత్రం ఇంకా కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు వాయిదాలో ఉన్నాయి. కాగా.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) 12వ తరగతి పరీక్షలను తాజాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సెకండ్‌వేవ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు PMO తెలిపింది.

12వ తరగతి పరీక్షల రద్దుతో దేశంలో విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో హోరెత్తించారు. అయితే.. ఓ విద్యార్థి మాత్రం ట్విట్టర్ లో ఓ వింత పోస్టు పెట్టాడు. కరోనా సెకండ్ వేవ్ తో పరీక్షలు రద్దు చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ మా స్కూల్ లో ఫేర్ వెల్ పార్టీ చేసుకొనేందుకు అనుమతి కావాలని ప్రధానిని కోరాడు. ఫేర్ వెల్ మీద అంత ఇష్టం ఎందుకా అనుకుంటారు కదా. అందుకే ఆ విద్యార్ధే దానికి సమాధానం కూడా చెప్పాడు.

కుకీ అగర్వాల్ అనే విద్యార్థికి 12వ తరగతి బీ సెక్షన్ లో చదివే నేహాను చీరలో చూడాలని ఉందట. ఫేర్ వెల్ వేడుక రోజున ఆమె చీరలో వస్తుందని.. అందుకే ఆ వేడుకకైనా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశాడు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేహాను చీరలో చూడాలని ఉందంటూ నెటిజన్లు ఫన్నీ ఫన్నీ మీమ్స్ తయారుచేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.