సైనికుల్లారా వంద‌నం : 20 మంది అమ‌ర వీర జ‌వాన్లు వీరే

  • Publish Date - June 18, 2020 / 05:06 AM IST

చైనా సైన్యం జ‌రిపిన దాడుల్లో అమ‌రులైన వీర జ‌వాన్లకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నారు. వారి అంతిమ‌యాత్ర‌లో ఘ‌నంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం వృథా కాదంటున్నారు. ఇదిలా ఉంటే.. పేర్ల‌ను భార‌త సైన్యం ప్ర‌క‌టించింది. గాల్వాన్ లోయ‌లో 2020, జూన్ 15వ తేదీన చైనా సైనికులు నిరాయుధులుగా ఉన్న భార‌తీయ సైనికుల‌పై దాడి జ‌రిపారు. 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు.

వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెజిమెంట‌ల్ క‌మాండ‌ర్ ఆఫీస‌ర్, సూర్య‌పేట‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు ఉన్నారు.  వీరుల‌కు భార‌త‌దేశం ఘ‌నంగ నివాళుల‌ర్పించింది. చైనాపై నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. చైనా జాతీయ ప‌తాకాన్ని త‌గుల‌బెట్టారు. ప్ర‌తికారం తీర్చుకోవాలంటున్నారు. అమ‌రులైన జ‌వాన్ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నివాళి అర్పించారు. జ‌వాన్ల బ‌లిదానాలు ఊరికే పోవ‌ని, ఈ అంశంపై ఎవ‌రికీ అనుమానం వ‌ద్ద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

20 మంది అమ‌రుల జ‌వాన్లు

పేరు ప్రాంతం
క‌ల్న‌ల్ సంతోష్ బాబు సూర్యాపేట‌
నాయ‌బ్ సుబేదార్ నాథూరామ్ సోరెన్ మ‌యూర్ భంజ్‌
నాయ‌బ్ సుబేదార్ మ‌న్ దీప్ సింగ్ పాటియాల‌
నాయ‌బ్ సుబేదార్, డ్రైవ‌ర్ స‌త్నం సింగ్ గురుదాస్ పూర్
కె.ప‌ళ‌ని మ‌ధురై
హ‌వ‌ల్దార్ సునీల్ కుమార్ పాట్నా
హ‌వ‌ల్దార్ బిపుల్ రాయ్ మీర‌ట్‌
ఎన్ కే (ఎన్ ఏ) దీప‌క్ కుమార్ రేవా
సిపాయి రాజ‌ష్ ఓరంగ్ బీర్ఘుం
సిపాయి కుంద‌న్ కుమార్ ఓఝూ సాహిబ్ గంజ్‌
సిపాయి గ‌ణేష్ రామ్ కాంకెర్‌
సిపాయి చంద్ర‌కాంత్ ప్ర‌ధాన్ కంద‌మాల్‌
సిపాయి అంకుష్ హ‌మీపూర్
సిపాయి గుర్బీంద‌ర్ సంగ్రూర్‌
సిపాయి గుర్తేజ్ సింగ్ మాన్సా
సిపాయి చంద‌న్ కుమార్ భోజ్ పూర్
సిపాయి అమ‌న్ కుమార్ స‌మ‌స్తిపూర్
సిపాయి జై కిశోర్ సింగ్ వైశాలి
సిపాయి గ‌ణేష్ హండ్సా ఈస్ట్ సింగ్ భూమి
సిపాయి కుంద‌న్ కుమార్ స‌హ‌ర్ష‌

 

Read:TikTokతో స‌హా 52 చైనా APPల‌పై నిషేధం ?