Yoga Day వచ్చేస్తోంది. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకొనే ఈ డే. ఈసారి కళ తప్పనుంది. ఇదొక్కటే కాదు..ఎంతో సందడి సందడిగా జరపాల్సిన కార్యక్రమాలు నిరాడంబరంగా సాగాయి..సాగుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే. కరోనా వైరస్. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని కబళించి వేస్తోంది. భారతదేశంలో కూడా వైరస్ పాజిటివ కేసులు పెరుగుతుండడం..ప్రజలు పిట్టల్ల రాలిపోతుండడంతో కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి వచ్చింది.
June 21st : –
జూన్ 21 వచ్చిదంటే..చాలు..ఠక్కున మదిలో మెదిలేది..యోగా. కొన్ని రోజుల ముందటి నుంచే..యోగా డే సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ 2020, జూన్ 21న అలాంటి పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేయడం లేదు. సంవత్సరంలోని 365 రోజుల్లో అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే..June 21 ప్రపంచ వ్యాప్తంగా…అంతర్జాతీయ Yoga దినోత్సవం నిర్వహించాలని UNO తీర్మానించిన సంగతి తెలిసిందే.
మోడీ వీడియో మెసేజ్ : –
దీంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కొద్దిసేపు Yoga చేస్తుంటారు. తాజాగా దీనిపై భారత ప్రధాని Narendra Modi స్పందించారు. Yoga సెలబ్రేషన్స్ ను ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ..జరుపుకోవాలన పిలుపునిచ్చారు. 60వ అంతర్జాతీయ Yoga దినోత్సవం సందర్భంగా భారతీయులను ఉద్దేశిస్తే..ఓ వీడియో ప్రసంగాన్ని వెలువరించారు.
ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా : –
ఇంట్లోనే యోగా.. కుటుంబంతో Yoga అని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్లల్లోనే Yoga సాధన చేయాలని, గుంపులుగా సాధన చేయొద్దన్నారు. యోగాతో శరీరం, మనస్సు మధ్య దూరం తొలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ దూరమే చాలా సమస్యలకు మూల కారణమని, ఆకాంక్షలకు, వాస్తవాలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుందన్నారు. ఈ సంవత్సరం International Yoga దినోత్సవ నినాదం ఇంట్లోనే Yoga.. కుటుంబంతో Yoga అన్నారు ప్రధాని మోడీ.
Read: తక్కువ ఖర్చుతో జనుము-రాగితో తాగునీటి శుద్ధి, ఐఐటీ సైంటిస్టుల ఆవిష్కరణ