కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో విధించిన లాక్ డౌన్…వలస కూలీల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు ఘటనలు చూపిస్తున్నాయి. ఉపాధి పోవడంతో..వారి వారి రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కాలినడకన వెళుతూ..చనిపోయిన సందర్బాలున్నాయి. కానీ..రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది చనిపోతుండడం అందర్నీ కలిచి వేస్తోంది. తాజాగా…ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రాజస్థాన్ నుంచి తమ తమ సొంతూళ్లకు కొన్ని కుటుంబాలు వెళుతున్నాయి. వీరు ట్రక్కులో వెళుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం…ఔరమా దగ్గర వీరు ప్రయాణిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొంది. దీంతో 23 మంది అక్కడికక్కడనే చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల రోదనలతో మారుమ్రోగుతోంది.
ఘటనా ప్రదేశం వద్ద హృదయవిదాకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2020, మే 14వ తేదీన మహారాష్ట్ర నుంచి కొంతమంది వలస కూలీలు సొంతూళ్లకు వెళుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ వద్ద కంటైనర్ ఢీకొనడంతో 8 మంది చనిపోయారు. మొన్నటికి మొన్న సొంత గ్రామాలకు వెళుతూ..రైలు పట్టాలపై పడుకున్న వలస కూలీలపై నుంచి రైలు వెళ్లడంతో 16 మంది వలస కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే.
Read More:
* వలస కార్మికుల రైలును మా రాష్ట్రంలో ఆపొద్దు : సీఎం
* సైకిల్ రిక్షాపై 500కి.మీ దూరంలోని సొంతూరుకి తల్లిదండ్రులను తీసుకెళ్తున్న 11ఏళ్ల బాలుడు