3 Black cobras : పడగ విప్పిన మూడు నల్ల కోడెనాగులు..చూస్తే వెన్నులో వణుకు..గుండె దడ ఖాయం

అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో పడగ విప్పిన మూడు నల్లటి త్రాచుపాములు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఈ మూడు నల్లటి కోడెనాగులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Lahore Most Poluted City In World 

3 Black cobras In one place : పడగ విప్పిన కోడెనాగును చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాముల్లో చాలా రకాలున్నాయి. సాధారణం మనకు కనిపించేవి గోధుమ రంగు త్రాచుపాములే కనిపిస్తాయి. కానీ నల్లటి కోడెనాగు కంటికి కనిపించిందా? ఇక వెన్నులో వణుకు..గుండె దడ పీక్స్ లోకి వెళ్లిపోతాయి. అటువంటిది నల్లటి మూడు కోడెనాగులు పడగవిప్పి ఒకేచోట నిలబడ్డాయి. ఓ చెట్టును చుట్టుకుని పడగవిప్పిన మూడు కోడెనాగుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోను చూస్తేనే గండె జలదిరిస్తోంది. కానీ అవే మన కళ్లముందు కనిపిస్తే ఇక వాటిని చూసే ఛాన్స్ ఉండదు..ఎందుకంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో మూడు నల్లటి త్రాచుపాములు పడగవిప్పి చూస్తున్నాయి. అది కూడా ఒకే దిశలో ఏదో విశేషం ఉన్నట్లుగా..మూడు ఒకదానికొకటి సంకేతాలు ఇచ్చుకున్నట్లుగా పడగ విప్పి ఒకే దిక్కుకు చూస్తున్నాయి. ఒక చెట్టు మొదలుని చుట్టుకుని పడగ విప్పిన ఈ మూడు పాములు సింగిల్ ఫ్రేమ్‌కు చిక్కటం చాలా చాలా అరుదనే చెప్పాలి. పడగలు విప్పిన మూడు నల్లటి త్రాచుపాముల ఫోటో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో రాజేంద్ర పోస్ట్ చేసిన ఫోటోల్లోని ఓ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద.. ఒకేసారి నిన్ను మూడు పాములు ఆశీర్వదించాయనే అర్థంతో క్యాప్షన్ పెట్టి రాజేంద్రకు ఫోటో క్రెడిట్ ఇచ్చారు.