Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

Uttar Pradesh Violence: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత ఒక‌రు అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఓ వ‌ర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తుండ‌డంతో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలను మీడియాకు వివరించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 36 మందిని అరెస్టు చేశామ‌ని పోలీసులు తెలిపారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల కుట్ర‌దారుల‌పై గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే కాకుండా, వారికి సంబంధించిన ఆస్తుల‌ను సీజ్ చేస్తామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ విజ‌య్ సింగ్ మీనా చెప్పారు.

Clashes in Kanpur: బీజేపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన: కాన్పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

మ‌రోసారి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. కాగా, శుక్ర‌వారం ప్రార్థ‌నల‌ అనంత‌రం రెండు వ‌ర్గాల వారు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగారు. ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకోవ‌డంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. మొత్తం 13 మంది పోలీసుల‌కు, 30 మంది ఇత‌రుల‌కు గాయాలైన‌ట్లు వివ‌రించారు.

ట్రెండింగ్ వార్తలు