Man COVID, Monkeypox, HIV Positive : 36 ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్‌, హెచ్‌ఐవీ పాజిటివ్‌.. ప్రపంచంలో తొలి కేసు

36 ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్‌, హెచ్‌ఐవీ పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచంలోనే ఇదే తొలి కేసు అంటున్నారు పరిశోధకులు.

Italian man tests positive for COVID, Monkeypox, HIV : కోవిడ్ వస్తేనే తట్టుకోలేని పరిస్థితి..మంకీపాక్స్ సోకితే తాళలేని పరిస్థితి. ఇక ప్రాణాంతకమైన ఎయిడ్స్ గురించి చెబితేనే హడలిపోతాం. అటువంటిది ఒకే వ్యక్తిపై ఈ మూడు మహమ్మారులు దాడి చేశాయి. పాపం ఓ చిన్న టూర్ కెళ్లిన పాపానికి ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఈ మూడు వైరస్ లు సోకాయి. ఇలా కోవిడ్, మంకీపాక్స్, హెచ్ఐవీ సోకిన కేసే ప్రపంచంలోనే మొదటిది అని వైద్యనిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్‌తోపాటు హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యింది. ఇటాలియన్‌ పరిశోధకులు ఒకే వ్యక్తిలో ఈ మూడు రకాల వైరస్ లను ఏకకాలం గుర్తించారు. సదరు వ్యక్తి ఇటీవల ఇటలీ నుంచి స్పెయిన్‌కు ఐదు రోజుల ట్రిప్ వెళ్లి ఇటలీకి తిరిగి వచ్చాడు. అతనిలో మూడు వైరస్ లను వైద్య నిపుణులు గుర్తించారు. జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట, తలనొప్పి రావటంతో సదరు వ్యక్తి పరీక్షలు చేయగా..కోవిడ్, మంకీపాక్స్, హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిదని ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.

జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. స్పెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత 36 సంవత్సరాల సదరు వ్యక్తికి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నడుము వాపు తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలు కనిపించిన తరువాత అతనికి మూడు రోజుల తర్వాత కరోనా సోకినట్లు గుర్తించారు.

ఆ తర్వాత కొద్దిగంటల్లోనే సదరు వ్యక్తి ఎడమ చేతిపై దద్దుర్లతో పాటు బొబ్బలు కనిపించాయి. ప్రస్తుతం సిసిలీ తూర్పుతీరంలో ఉన్న కాటానియాలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య పరీక్షలు చేయగా.. రిపోర్టుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గానూ తేలింది. సదరు వ్యక్తి 2021లో హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్‌గా వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు