ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 57 కొవిడ్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 57 కొవిడ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157కు చేరుకుంది. ఇందులో 857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో 48మంది చనిపోయారు. కొత్తగా అనంతపురం జిల్లాలో 4, చిత్తూరు 14, ఈస్ట్ గోదావరి 1, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8, నెల్లూరు 14, విశాఖ 2, విజయనగరం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. శుక్రవారం మళ్లీ పెరిగాయి.
గడిచిన 24 గంటల్లో 9వేల 38 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. వారిలో 102 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 102 మందిలో 45మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిగా అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన 34 మందికి, రాజస్తాన్ నుంచి వచ్చిన 11మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 599 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 404 కేసులు ఉన్నాయి. ఇవాళ్లి లెక్కల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలోనే 15 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల వారికి సంబంధించిన కేసుల్ని ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ కేసులు 150 ఉన్నాయని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారి కేసుల్ని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:
Read Here>> ఏపీలో 24 గంటల్లో 36 కరోనా కేసులు