Boy Falls In Borewell
Boy Falls In Borewell: ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్‌లో ఆదివారం జరిగింది. హోషియార్‌పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది. బోరుబావికి సమీపంలో ఆడుకుంటున్న బాలుడి వెంట వీధి కుక్కలు పడటంతో, వాటిని తప్పించుకునేందుకు వేగంగా పరుగెత్తాడు.
Delhi’s triple suicide: దారుణం.. విషవాయువు పీల్చి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
ఈ క్రమంలో బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని పైకి లాగేందుకు ఒక క్లిప్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే, అది సాధ్యపడలేదు. బాలుడు తల కిందులుగా పడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు బాలుడిని వెలికితీసే సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, ఈ జేసీబీ గంటన్నరకు పదిహేను అడుగుల వరకు మాత్రమే తవ్వకాలు జరపగలదు. దీంతో అదనపు మెషినరీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భారత సైన్యం కూడా బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగింది.
Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త
ప్రస్తుతం బాలుడు 95 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి బాలుడు సురక్షితంగానే ఉన్నాడని, ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. గద్రివాలా గ్రామం జిల్లా కేంద్రమైన హోషియార్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.