Dancing Dadi : ఏజ్ ఎంతైనా తగ్గేదేలే..సూపర్ స్టెప్పులతో శ్రీదేవిని దించేసిన 63 ఏళ్ల బామ్మ..

ఏజ్ ఎంతైనా తగ్గేదేలే అంటూ సూపర్ స్టెప్పులతో శ్రీదేవిని దించేసిన 63 ఏళ్ల బామ్మ. డ్యాన్సింగ్‌ దాదిగా పేరొందిన 63 ఏళ్ల రవి బాల శర్మ అందాల నటి శ్రీదేవిని అచ్చంగా దించేశారు.

Dancing Dadi

63 Year Old Dancing Dadi  : అందానికే అందం అలనాటి నటి శ్రీదేవి. అందమే కాదు అభినయంలోను ఆమెది ఓ హవా. ఇక డ్యాన్స్ విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి పక్కన ఏ హీరోయిన్ ఉన్నా కళ్లన్నీ చిరంజీవి పైనే ఉంటాయి. కానీ మెగాస్టార్ పక్కన అందానికే అందం అద్దినట్లుండే శ్రీదేవి ఉంటే ఎవర్ని చూడాలో కూడా అర్థం కాదు. డ్యాన్స్ కూడా అంత బాగా చేస్తుంది శ్రీదేవి. ఆమె కనుమరుగైపోయినా ఆమె రూపం మాత్రం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే ఉంది.అటువంటి శ్రీదేవి డ్యాన్స్ తో అద్దరగొట్టేస్తున్నారు ఓ బామ్మగారు. అందంలోను డ్యాన్స్ లోను కూడా శ్రీదేవితో పోటీ పడిందా?అన్నట్లుగా ఉన్నారీ బామ్మగారు.

Read more : Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ
ఇటీవల కాలంలో బామ్మలు డ్యాన్సులతో పిచ్చెక్కించేస్తున్నారు. ఈ బామ్మా? భామా?అన్నట్లుగా డ్యాన్స్‌ చేస్తూ ఏజ్‌ ఇజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అంటూ నిరూపిస్తున్నారు. వీరిలో ఒకరు డ్యాన్సింగ్‌ దాదిగా పేరొందిన 63 ఏళ్ల రవి బాల శర్మ. ఈ వయస్సులో కూడా తగ్గేదిలే అండున్నారు. తనదైన స్టైల్లో డ్యాన్స్‌ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.

Read more : Grandma Dance : రెండు జడల 62 ఏళ్ల బామ్మ ‘కోయి లడ్కి హై’ పాటకు డ్యాన్స్ ఇరగదీసిందిగా..

ఈ డాన్సింగ్‌ దాది మరోసారి తన డ్యాన్స్‌ వీడియోతో నెటిజన్లను కట్టిపడేశారు. 2012లో వచ్చిన శ్రీదేవి ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సినిమాలోని నవ్రాయ్ మాఝీకి పాటకు ఎంతో యాక్టివ్ గా డ్యాన్స్‌ చేశారు రవిబాల శర్మ. ముచ్చటైన చీర కట్టులో అందంగా ముస్తాబై పర్‌ఫెక్ట్‌ స్పెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో చించేసారీవిడ. ఏమాత్రం తగ్గని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో శ్రీదేవిని అచ్చుగుద్దినట్లుగా దింపేశారు. బామ్మగారి డాన్సింగ్ వీడియో నెట్టింట్లో చిందులేస్తోంది. రవి బాల శర్మ డ్యాన్స్‌ మూమెంట్స్‌కి ఎప్పటిలాగే నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు. ‘సూపర్‌ స్టెప్పులతో శ్రీదేవిని దించేసిందంటూ తెగ పొడిగేస్తున్నారు.