ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ప్రతిఒక్కరూ టిక్ టాక్ తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. టిక్ టాక్ ఎన్నో ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే చిన్న పిల్లల నుంచి అందరూ టిక్ టాక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టిక్ టాక్‌పై ఎన్నో సందర్భాల్లో వివాదస్పదమైంది. అయినప్పటికీ టిక్ టాక్ క్రేజ్ భారత మార్కెట్లలో ఎంతమాత్రం తగ్గలేదు. ఇప్పుడు యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి రావడంతో ప్రతిఒక్కరూ టిక్ టాక్ నుంచి భారతీయ యాప్ Mitron, Roposo వైపు మారిపోతున్నారు.
కానీ, మిలియన్ల ఫాలోవర్లు ఉన్న టిక్ టాక్ యాప్ స్థానాన్ని భర్తీ చేయాలంటే అంత ఈజీ కాదు. ప్రతిరోజు టిక్ టాక్‌లో మిలియన్ల మంది వీడియోలను క్రియేట్ చేసి షేరింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్ ప్లాట్ ఫాంపై చేరిన యూజర్ల భారీగా పెరిగిపోయింది. టిక్ టాక్ ఆఫర్ చేసే దాదాపు అన్ని ఫీచర్లు చాలామంది యూజర్లకు బాగా తెలుసు. ఫీచర్లను ఎలా వాడోలో కూడా తెలిసే ఉండొచ్చు. కానీ, టిక్ టాక్ యూజర్లకు తెలియని చాలా ఫీచర్లు ఉన్నాయి. మీరు కూడా టిక్ టాక్ యూజర్ అయితే ఈ ఫీచర్లు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో చెక్ చేయండి.. లేదంటే ఒకసారి ప్రయత్నించండి. అవేంటో ఓసారి చూద్దాం.
Age gate: టిక్ టాక్ యూజర్లు అకౌంట్ క్రియేట్ చేయాలంటే 13 ఏళ్ల వయస్సు పైబడి ఉండాలి. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారికి అకౌంట్ క్రియేట్ చేసేందుకు అనుమతి లేదు.
Screen time management: టిక్ టాక్ ప్లాట్ ఫాంపై రోజుకు 40 నిమిషాలు, 60 నిమిషాలు, 90 నిమిషాలు, 120 నిమిషాలు ఉండేలా ఎంపిక చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈ ఫీచర్ పాస్ వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. స్ర్కీన్ టైమ్ రీచ్ కాగానే యూజర్లు పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే టిక్ టాక్ కొనసాగించవచ్చు.
Restricted mode: టిక్ టాక్ తమ ప్లాట్ ఫాంపై మైనర్ల రక్షణ కోసం కస్టమైజడ్ మోడ్ ఫీచర్ రూపొందించింది. ఇది ఆప్షనల్ అకౌంట్ సెట్టింగ్. మైనర్లకు టిక్ టాక్‌లో పరిమితంగానే ఫీచర్లు కనిపిస్తాయి. అంతేకాదు.. పాస్ వర్డ్ ప్రొటెక్టడ్ (30 రోజులు) ఫీచర్ ఉంది. మెషన్ లెర్నింగ్ అల్గారిథిమ్స్ ఈ పాస్ వర్డ్ పనిచేస్తుంది. అన్ ఫిల్డర్డ్ కంటెంట్ మైనర్లు వినియోగించాలంటే కచ్చితంగా పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
In-app suicide prevention: యూజర్ సమస్యలకు సంబంధించి కీలక కాంటాక్టులను టిప్స్ అందించేందుకు వీలుగా ఇన్-యాప్ సూసైడ్ రీసోర్స్ పేజీకి యూజర్లు రీడైరెక్ట్ అవుతారు.
Risk warning tag: అందరూ యూజర్లకు లేదా రిస్క్ సంబంధిత కంటెంట్ ఉన్న వీడియోలకు ట్యాగ్ యాడ్ చేసి ఉంటుంది.
Comment filter feature: కామెంట్ సెక్షన్ నుంచి హిందీ లేదా ఇంగ్లీష్ సెల్ఫ్ డిఫైన్ వర్డ్స్ వాడేందుకు యూజర్లను ఈ ఫీచర్ అనుమతినిస్తుంది. అసభ్య పదజాలం ఉంటే.. దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది.
Family Pairing: టిక్ టాక్ లోని ఇన్-యాప్ ఫీచర్ ద్వారా టిక్ టాక్ అకౌంట్లను లింక్ చేయడం లేదా అన్ లింక్ చేసుకోవచ్చు. పిల్లల టిక్ టాక్ అకౌంట్లలో ప్రైవసీ సెట్టింగ్స్ పై తల్లిదండ్రులు కంట్రోల్ చేయొచ్చు.
ఒకసారి ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తే చాలు.. Digital Wellbeing ఫీచర్లలో Screen Time Management, Restricted Mode, and Direct Messages settings వాటిపై పేరంట్స్ కంట్రోల్ ఉంటుంది.
In-app reporting: రియల్ టైమ్ టిక్ టాక్ ప్లాట్ ఫాంపై ఏదైనా అభ్యంతర కంటెంట్ పై రిపోర్టు చేయాలనుకుంటే యూజర్లకు ఈ ఫీచర్ అనుమతినిస్తుంది.
Read: షియోమీ, రియల్‌మికి పోటీగా : OnePlus చీపెస్ట్ స్మార్ట్ టీవీ జూలై 2న వస్తోంది!