95-year-old man playing dhol : పెళ్లిలో డోలు వాయించిన వృద్ధుడు.. కన్నీరు పెట్టుకున్న నటులు

వయసు మళ్లుతున్నా ఆర్ధిక పరిస్థితులు బాగోక కొందరు వృద్ధులు కష్టపడే వారు కనిపిస్తూ ఉంటారు. 96 ఏళ్ల ఓ పెద్దాయన పెళిళ్లలో డోలు వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓ పెళ్లిలో డోలు వాయిస్తూ కనిపించిన ఆయన పరిస్థితి అందరికీ కన్నీరు తెప్పించింది.

95-year-old man playing dhol

Viral Video : కుటుంబ పోషణ కోసం 96 ఏళ్ల వృద్ధుడు ఓ పెళ్లిలో డోలు వాయించాడు. అదే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న ఆ పెద్దాయన కష్టం అందర్నీ కలచివేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వృద్ధుడి వీడియోపై చాలామంది నటులు రియాక్టయ్యారు.

Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి

ఆర్ధిక పరిస్థితిలు బాగోక చాలామంది వృద్ధులు కష్టపడేవారిని మనం చూస్తూ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో mr_pandeyji_198 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో పెళ్లిలో వృద్ధుడు డోలు వాయించడం కనిపిస్తుంది. ఇదే జీవనాధారంగా ఆ పెద్దాయన కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిసింది.

A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

పెద్దాయన చాలా ఉత్సాహంగా సంగీతం వాయిస్తున్నారు. అయితే వీడియోలో ఆయన ప్రయత్నాన్ని ఎవరూ అభినందించలేదు సరికదా.. కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. ఇది చూసే చాలామంది యూజర్లు షాకయ్యారు. ఆ పెద్దాయన చాలా విచారంలో ఉన్నట్లు కనిపించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నటి పాలక్ సింధ్వానీ హార్ట్ ఎమోజీలతో స్పందించగా.. నటుడు ఆదర్శ్ ఆనంద్ ఈ వీడియో చూస్తే కన్నీరు వచ్చిందని షేర్ చేశారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాహుల్ శెట్టి రుత్విక్ ఆ పెద్దాయన అడ్రస్ తెలుసుకోవడానికి సాయం చేయమని.. లేదంటే ఆయనకి ఎవరైనా సాయం చేయండి అని రిక్వెస్ట్ చేశారు.