Thief crow : కరెన్సీ నోట్లు దొంగిలించి దాచుకుంటున్న కాకి..కాస్ట్లీ గూడు కట్టుకుంటుందేమో..

చిన్నపిల్లల చేతిలో చిరుతిళ్లు ఎత్తుకుపోయే కాకుల్నిచూశాం. కానీ ఓ కాకి ఏకంగా కరెన్సీ నోట్లు ఎత్తుకుపోయి ఏం చేస్తోందంటే..

Crow Stealing Currency Notes (1)

a crow stealing currency notes : పక్షులలో కాకి ఎంత టక్కరిదో అంత తెలివైందికూడా. చిన్నప్పుడు దాహం వేసిన కాకి కడవలో అడుగు భాగంలో ఉన్న నీటిని గులకరాళ్లు వేసి పైకి తెప్పించి దాహం తీర్చుకుందని చదువుకున్నాం. అలాగే చిన్నపిల్లల చేతుల్లో ఉండే తినుబండారాలను ఎత్తుకుపోయే దొంగ కాకుల గురించి చూశాం. కానీ ఏకంగా ఏకంగా ‘కరెన్నీ నోట్లు’ ఎత్తుకుపోయి దాచుకునే కాకి గురించి విన్నామా? ఇదిగో ఇక్కడ ఉన్న కాకి అటువంటిదే. ఏకంగా కరెన్సీ నోట్లను ఎత్తుకుపోయి దాచేస్తోంది. మరి వాటితో గూడు కట్టుకుంటుందో ఏమో..కరోన్సీ నోట్లు ఎత్తుకుపోయి దాచుకుంటున్న కాకి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో దొంగ కాకి హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో ఓ కాకి కిటికీ నుంచి ఒక ఫ్లాట్‌లోకి చొరబడి ఒక టేబుల్‌పై వాలుతుంది. దాని ముక్కుకి ఓ కరెన్సీ నోటు ఉంటుంది. అది ఆ టేబుల్‌కి ఉండే డెక్స్‌ ఒకటి కొంచెం తెరుచుకొని ఉంటుంది. అందులో అప్పటికే కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. మరి అప్పటికే ఆ నోట్లు అక్కడున్నాయో..లేదా వాటిని ఎత్తుకొచ్చి అక్కడ దాస్తోందోమరి. కానీ ఆ డ్రాలో మాత్రం కరెన్సీ నోట్లు చాలానే ఉన్నాయి. కాకి ముక్కుతో నోట్లను పట్టుకొచ్చి దాంట్లో వేస్తున్నట్లే ఉంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయిపోతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవ్యక్తి ఆ కాకి నా దగ్గర ఉంటే ఏటీఎంగా ఉపయోగించుకుంటారని ఒకరంటే..ఇంకొకరు ఇలాంటి కాకులు కూడా ఉంటాయా ? వాటే వండర్ అంటున్నారు. మరికొంతమంది పక్షులతో కూడా జాగ్రత్తగా ఉండాలండోయ్ లేదంటే ఏమైనా ఎత్తుకుపోతాయ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ దొంగ కాకి వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేసేస్తోంది.