A Mother Including Two Children Suicide
mother and two children suicide : పెద్దపల్లి జిల్లాలో పండుగ రోజు విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లల సహా తల్లి బలవన్మరానికి పాల్పడ్డారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో నివాసముంటున్న తల్లి విజయ, 16 నెలల పాప శ్రీ కూర్తి .. 3 సంవత్సరాల చిన్నారి శివకృష్ణ.. ముగ్గురు బావిలో దూకి సూసైడ్ చేసుకున్నారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక విజయ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.