×
Ad

Young Man Monkeypox : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్‌ కలకలం..మణుగూరులో యువకుడికి లక్షణాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్‌ కలకలం రేగింది. మణుగూరులో యువకుడికి మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. మణుగూరుకు చెందిన ఓ యువకుడి ఒంటి నిండా అకస్మాత్తుగా దద్దుర్లు రావడంతో అతన్ని హుటాహుటిన కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులు, మొహంపై ఎర్రటి దద్దుర్లు, మచ్చలు ఎక్కువగా కనిపించడంతో బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించాలని కొత్తగూడెం వైద్యులు నిర్ణయించారు.

  • Published On : August 5, 2022 / 09:07 PM IST

young man monkeypox

Young Man Monkeypox : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్‌ కలకలం రేగింది. మణుగూరులో యువకుడికి మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. మణుగూరుకు చెందిన ఓ యువకుడి ఒంటి నిండా అకస్మాత్తుగా దద్దుర్లు రావడంతో అతన్ని హుటాహుటిన కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులు, మొహంపై ఎర్రటి దద్దుర్లు, మచ్చలు ఎక్కువగా కనిపించడంతో బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించాలని కొత్తగూడెం వైద్యులు నిర్ణయించారు.

మణుగూరుకు చెందిన యువకుడు…డెహ్రాడూన్‌లో చదువుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం మణుగూరు చేరుకున్న అతను స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఈ మూడు రోజులలో విపరీతంగా దద్దుర్లు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆ యువకుడిని కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి.. కేంద్రం కీలక సూచనలు

బాధిత యువకుడి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుని ల్యాబ్‌ టెస్ట్‌కు పంపించారు. యువకుడికి మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరరకు హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రికి బాధితుడిని తరలిస్తున్నారు.