Koffee with Karan : కరణ్ సెక్స్ ప్రశ్నలకి కౌంటర్ ఇచ్చిన అమీర్ ఖాన్

తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో భాగంగా కరీనా కపూర్, అమీర్ ఖాన్ ఈ షోకి వచ్చారు. వీళ్ళని కూడా తన సెక్స్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని చూసాడు కరణ్. కరణ్ జోహార్.. కరీనాకు సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో.........

  • Published On : August 2, 2022 / 05:51 PM IST

Aamir Khan :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తవగా ఐదో ఎపిసోడ్ లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా ఐదో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సాధారణంగా కరణ్ తన షోలో పర్సనల్ క్వశన్స్ కూడా అడుగుతాడు. సెక్స్ మీద కూడా ప్రశ్నలు వేస్తాడు. కొన్ని సార్లు అవతలి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కరణ్ అదేమీ పట్టించుకోడు. ఇటీవల విజయ్ దేవరకొండ ఎపిసోడ్ లో కూడా చాలా ప్రశ్నలు సెక్స్ గురించి అడిగాడు. దీంతో విజయ్ వాటికి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడు.

 

తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో భాగంగా కరీనా కపూర్, అమీర్ ఖాన్ ఈ షోకి వచ్చారు. వీళ్ళని కూడా తన సెక్స్ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని చూసాడు కరణ్. కరణ్ జోహార్.. కరీనాకు సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో నీకు తెలియదా అని చెప్పింది. దీంతో కరణ్ మా అమ్మ కూడా టాక్ షో చూస్తుంటుంది, నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడితే తను ఏం అనుకుంటుంది అని అన్నాడు. దీంతో వెంటనే మరి మీ అమ్మ ఇతరుల సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తుంటే ఏం అనుకోదా అంటూ కరణ్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు నువ్వు అసలు అంటూ అమీర్ కరణ్‌ను తన మాటలతో కట్టేశాడు.

Mannara Chopra : మైమరిపించే మన్నారా చోప్రా అందాలు

దీంతో ఈ ప్రోమో చుసిన వాళ్లంతా అమీర్ ఖాన్ కరణ్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చాడని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగడని కామెంట్స్ చేస్తున్నారు.