బట్టలు మార్చుకుంటూ.. బాల్‌ను మిస్ చేసి బౌండరీకి పంపేసిన ఫీల్డర్
- Subhan Ali Shaik
- Updated on- February 2, 2021 / 04:37 PM IST
Jersey: అబుదాబి టీ10 లీగ్ ఆశించినట్లుగానే కాకుండా మరో రకమైన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంది. నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ నుంచి వేనె పార్నెల్ హ్యాట్రిక్ వరకూ టోర్నమెంట్ లో ప్రతీది ఉత్కంఠభరితంగానే ఉంది. దీనికి పూర్తి విరుద్ధమైన మరో సీన్ జరిగింది. అబు ధాబి, నార్తరన్ వారియర్స్ మధ్య ఓ ఘటన జరిగింది. క్రీడాలోకం ఎప్పుడూ చూడనంత హాస్యభరిత సన్నివేశం చోటుచేసుకుంది.
అబుదాబికి ఆడుతున్న యూఏఈ ఇంటర్నేషనల్ రోహన్ ముస్తఫా బౌండరీ వద్ద ఫీలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో వారియర్స్ బ్యాట్స్ మన్ వసీం ముహమ్మద్ బౌండరీ వైపుకు బంతిని బాదాడు. ముస్తఫా జెర్సీ మార్చుకుంటూ చేతులు దూర్చి తలపైకి పెట్టుకునే లోపే బంతి అతని దగ్గరకు వచ్చేసింది. దానిని ఆపేందుకు జెర్సీని పైకి కిందకు తిప్పుతూ ఎలా అయితే బౌండరీకి పంపించేశాడు. ఈ బౌండరీకి అతని జట్టుతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లు కూడా నవ్వుకోవడం మొదలుపెట్టారు.
ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగానే సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అబుదాబి 123/3 చేయగా.. నార్తరన్ వారియర్స్ 2వికెట్లు నష్టపోయి 124పరుగులు చేయడంతో 8వికెట్ల తేడాతో విజయం దక్కింది. ఈ ఫన్నీ బౌండరీ బాదిన వసీం ముహమ్మద్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Just when you think you’ve seen it all pic.twitter.com/mjveCV5cvX
— David T (@SportingTrade) February 1, 2021
