Nikhil Siddhartha : దయచేసి వ్యాక్సిన్​ వేయించుకోండి -నిఖిల్

చాలా రోజుల తర్వాత ఇండియాలో లక్ష కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.. ఇది చాలా ఆనందించదగ్గ విషయం..

Actor Nikhil Siddhartha Spread Awareness On Covid Vaccination

Nikhil Siddhartha: ‘‘మనందరం ఇప్పుడు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. బాధ్యత ఉన్న పౌరులుగా అందరం కావాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుంటునే ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఇండియాలో లక్ష కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. కేసులు తగ్గాయి కదా అని అలసటగా ఉంటే మరింత ప్రమాదం. ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. మనం మరింత భద్రతగా ఉండటానికి మన పీఎం, సీఎం చెప్పినట్లు అంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.

కరోనా వైరస్‌పై మనం చేసే పోరాటానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సినేషన్ మాత్రమే. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ వేయించుంకోండి.

మా వంతుగా ప్రతివారం ఒక గ్రామానికి వెళ్లి ఫ్రీ వ్యాక్సినేషన్ వేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనుకుంటున్నారో.. ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్‌లో Actor Nikhil అని ట్యాగ్ చేస్తే వ్యాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేస్తాం. జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్’’..