actor Sunny Leone's photo on hall ticket of Karnataka govt exam
Sunny Leone photo on hall ticket of Karnataka govt exam : కర్ణాటకలో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఓ యువతికి విద్యాశాఖ అందజేసిన హాల్ టికెట్ లో అభ్యర్ది ఫోటోకు బదులుగా ప్రముఖ నటి సన్నీలియోన్ ఫోటో ముద్రించారు. దీంతో సదరు యువతి పలు ఇబ్బందులకు గురి అయింది. గత ఆదివారం జరిగిన టీచర్ఎలిజిబిటీ టెస్ట్ (టెట్) అడ్మిషన్ టికెట్ లో పోర్న్ స్టార్ గా పేరొందిని సన్నీలియోన్ ఫోటో ఉంటంతో సదరు యువతి పలు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. టెట్ కు నాలుగు రోజు ముందు ఓ యువతి తన అడ్మిషన్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుంది. డౌన్ లోడ్ అయ్యాక హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫోటో ఉండటంతో షాక్ అయ్యింది.
పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ అధికారుల సహాయంతో ఆమె ఎడిట్ ఆప్షన్‌ని ఉపయోగించి సన్నీలియోన్ ఫోటో కు బదులు తన ఫోటో వచ్చేలా మార్చగలిగినప్పటికీ..అది ఆమె మానసిక పరిస్థితిపై ప్రభావం చూపించింది. ఈ ఫోటో మార్పు పరిణామాలతోనే నేను పరీక్ష కూడా సరిగ్గా వ్రాయలేకపోయాను అని సదరు యువతి ఆవేదన వ్యక్తంచేసింది. సన్నీలియోన్ ఫోటోకు బదులు నా ఫోటో ఏర్పాటు చేసే క్రమంలో పలు ఇబ్బందులు పడ్డానని ఆ ఫోటోకు పైన నా ఫోటో అతికించి అక్కడిక్కడే నా సంతకం చేయటం ద్వారా అధికారులు నన్ను పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారని ఇటువంటి ఇబ్బందులతో పరీక్ష సరిగా రాయలేకపోయానని ఆవేదన వ్యక్తంచేసిందామె.
ఈవిషయాన్ని కర్నాటక కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. హాల్ టికెట్‌ని అడ్డుపెట్టుకొని నెటిజన్లు ప్రభుత్వం, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలు భారీ స్థాయిలో రావడంతో కర్నాటక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
కర్నాటక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్‌లు చూసే మంత్రులున్న ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షల నిర్వాహణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు..సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు. ఈ సన్నీలియోన్ ఫోటో వ్యవహారం దుమారం రేపడంతో కర్నాటక విద్యాశాఖ ఈఘటనపై విచారణకు ఆదేశించింది. అభ్యర్ధి ఫోటో మారినందుకు పొరపాటును ఒప్పుకోవాల్సి వచ్చింది.