Pudding And Mink: ఎలాంటి విచారణకైనా సిద్ధమే – నటి కుషిత

హైదరాబాద్ బంజారా హిల్స్‌‌లోని రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ స్వాధీనంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఈ పబ్‌లో డ్రగ్స్....

Actress Kushita About Pudding And Mink Pub Drugs Case

Pudding And Mink: హైదరాబాద్ బంజారా హిల్స్‌‌లోని రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ స్వాధీనంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఈ పబ్‌లో డ్రగ్స్ వినియోగంపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ పబ్‌పై వారు రైడ్ చేశారు. ఈ పబ్‌లో ఏకంగా 150 మంది యువతీయువకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిలో కొందరు సెలెబ్రిటీలు కూడా ఉండటంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.

Pudding And Mink Pub : ఫుడ్డింగ్ పబ్ కేసు..కీలకాంశాలివే, ఇద్దరు పరార్

కాగా ఈ డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది టాలీవుడ్ నటి కుషిత. 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె ఆ పబ్‌‌లో ఏం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు వెళ్లగా.. అక్కడ దాదాపు 150 మంది వరకు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. పబ్‌లో పార్టీకి వెళ్లామని.. తన స్నేహితులతో వెళ్లిన ఆమె పార్టీలో చిల్ అయ్యామంటూ చెప్పుకొచ్చింది. అయితే అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు అక్కడి చేరుకుని, మ్యూజిక్ ఆఫ్ చేసి, పబ్‌పై రైడ్ చేస్తున్నట్లు తెలిపారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు ఏమాత్రం అర్థం కాలేదని కుషిత తెలిపింది.

పబ్ నుండి ఎవరూ బయటకు వెళ్లకుండా పోలీసులు లాక్ చేసి, అందులో ఉన్న 150 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. అందరి వివరాలు తీసుకున్నారని.. అయితే 150 మందిలో కొందరు మాత్రమే డ్రగ్స్ తీసుకొని ఉంటారని.. కానీ అందరినీ బ్లేమ్ చేస్తున్నారంటూ కుషిత వాపోయింది. ఇక మీడియా ఛానల్స్‌లో తన ఫోటోలను పదేపదే టెలికాస్ట్ చేస్తున్నారని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విరాచణకైనా సిద్ధంగా ఉన్నానంటూ కుషిత చెప్పుకొచ్చింది.

Pudding and Mink Pub: పబ్ లో డ్రగ్స్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు: డ్రగ్స్ కోసం ఏకంగా “స్మార్ట్ యాప్”

తన ఫోటోలు మీడియాలో వస్తుండటంతో తన డైరెక్ట్స్, బంధువులు, స్నేహితులు ఫోన్ చేసి తన గురించి అడిగి తెలుసుకుంటున్నారని.. తాను పోలీసుల విచారణకే కాదు.. బ్లడ్ సాంపిల్స్ ఇవ్వడానికి కూడా రెడీ అంటూ కుషిత చెప్పుకొచ్చారు. ఏదేమైనా పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ లభ్యంతో మరోసారి టాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.