పెళ్లి ఎప్పుడంటే? సాయిపల్లవి మాటకు ఫ్యాన్స్ షాక్..!

  • Publish Date - June 12, 2020 / 04:36 PM IST

Sai Pallavi (Image:Instagram)

అందాల కోలివుడ్ ముద్దుగుమ్మ సాయి పల్లవి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. సాయి పల్లవి చెప్పిన మాట విన్న ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవికి టాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగింది. ఈ మూవీ సక్సెస్‌తో వరుస అవకాశాలు రావడంతో సాయిపల్లవి బిజీగా ఉంది.

అసలు.. సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? ఎవరిని చేసుకుంటుంది? వరుడు ఎలా ఉండాలనుకుంటోంది అనేదానిపై అభిమానుల్లో తెగ చర్చ నడించిందట. అయితే తన పెళ్లి విషయంలో సాయి పల్లవి ఓపెన్ గానే స్పందించింది. ఆమె చెప్పిన సమాధానంతో అభిమానులను ఆశ్చర్యపోయారంతా. 

సాయి పల్లవి.. అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోదంట. తాను పెళ్లి చేసుకోవాలన్న ప్లాన్ ఏమి లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది. తాను ఎప్పటికీ తన తల్లిదండ్రులతోనే ఉండాలని కోరుకుంటుందంట. పెళ్లి చేసుకుంటే కుదరదని.. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంటుందట.