Tamannaah: మొటిమలకు తమన్నా గమ్మత్తైన చిట్కా!
మన సెలబ్రిటీల గ్లామర్ వెనుక రహస్యం తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. నటీనటులంటే వారి డ్రెస్సింగ్ నుండి వారి డైట్ వరకు.. నడక నుండి స్టైల్ వరకు ప్రతిదీ ఫాలో అయ్యేవాళ్ళు ఎందరో ఉంటుంటారు.
- Naresh Mannam
- Updated on- June 17, 2021 / 07:35 PM IST
Tamannaah
Tamannaah: మన సెలబ్రిటీల గ్లామర్ వెనుక రహస్యం తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. నటీనటులంటే వారి డ్రెస్సింగ్ నుండి వారి డైట్ వరకు.. నడక నుండి స్టైల్ వరకు ప్రతిదీ ఫాలో అయ్యేవాళ్ళు ఎందరో ఉంటుంటారు. అయితే ఒక్కోసారి వాళ్ళు చెప్పే మాటలు నమ్మాలో వద్దో కూడా అర్ధం కాదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తమన్నాకు మిల్కీ బ్యూటీ అని పేరు. అందంలో తమ్మూకి పేరు పెట్టేందుకు ఏమీ లేదు. మచ్చలేని చందమామగా అభిమానులు ఆరాధిస్తారు.
అయితే.. అలాంటి తమ్మూ చెప్పిన బ్యూటీ చిట్కా ఒకటి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదేమంటే చర్మ సమస్యలను నివారించేందుకు లాలాజలం చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. చర్మ సమస్యల విషయంలో లాలాజలం చాలా ఉపయోగపడుతుందని.. ఉదయాన్నే స్రవించే లాలాజలానికి చర్మ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉందని చెప్పింది. అయితే చర్మ సమస్యలు వచ్చినపుడు మాత్రం వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించింది.
తమన్నా ఆపిల్ సైడర్ వెనిగర్ తో బంకమట్టి రకం కలిసిన ఒక రకాన్ని వినియోగిస్తానని.. ఇది కూడా మీకు చాలా విచిత్రమైనదని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే నా ముఖంపై దానిని ఎలా ఉంచాలో నాకు సరిగ్గా తెలియదు. నా ముఖంపై ఉంచిన మరో విచిత్రమైన విషయం ఏంటనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. అయితే మీ ప్రశ్నకు సరైన సమాధానం మీ స్వంత లాలాజలం.. వినడానికి కఠినంగా ఉన్నా ఇది వాస్తవం అని చెప్పింది. అయితే.. లాలాజలం చర్మానికి అంటే వినడానికే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు ఈ చిట్కా చర్చకు దారితీస్తుంది.
