‘మేజర్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన మహేష్..

‘మేజర్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన మహేష్..

Updated On : December 17, 2020 / 11:38 AM IST

Major FirstLook: అడివి శేష్ హీరోగా, ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న మూవీ ‘మేజర్’. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైయీ మంజ్రేకర్ కథానాయికలు.

26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ గురువారం శేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు రిలీజ్ చేశారు. శేష్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. అతని కెరీర్‌లో ‘మేజర్’ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మహేష్.

Major

‘మేజర్’ గా శేష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించడానికి తను కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ ‘మేజర్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే : అడవి శేష్, స్క్రిప్ట్ గైడెన్స్, డైలాగ్స్ : అబ్బూరి రవి, హిందీ డైలాగ్స్ : అక్షత్ అజయ్ శర్మ, కెమెరా : వంశీ పచ్చిపులుసు, సంగీతం : శ్రీ చరణ్ పాకాల.

Major FirstLook