Goa AAP CM Candidate : గోవా ఆప్ సీఎం అభ్యర్థి అడ్వకేట్ అమిత్ పాలేకర్: కేజ్రీవాల్

పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఖరారు చేసిన ఆప్. గోవా సీఎం అభ్యర్థి పేరు కూడా ప్రకటించింది. గోవాలో ఆప్ సీఎం అభ్య‌ర్థిగా అమిత్ పాలేక‌ర్‌ పేరును సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు

Aap Cm Candidate Advocate Amit Palekar For Goa

AAP CM Candidate advocate amit palekar for goa : స్థానిక పార్టీగా ఆవిర్భవించి నేషనల్ పార్టీగా ఎదుగుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంట్లో భాగంగా దేశంలో జరుగనున్న ఎన్నికల్లో పోటీకి సై అంటోంది.ఇప్పటికే పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఖరారు చేసిన ఆప్ తాజాగా గోవా సీఎం అభ్యర్థి పేరు కూడా ప్రకటించింది. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్య‌ర్థిగా అమిత్ పాలేక‌ర్‌ పేరును సీఎం అరవింత్ కేజ్రీవాల్ ప్రకటించారు.

గోవాలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌్లో అమిత్ పాలేక‌ర్ త‌మ పార్టీ నుంచి సీఎం అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ారని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. గోవాలో ఉన్న 40 స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయ‌నుందని స్పష్టంచేశారు కేజ్రీవాల్. భండారి సామాజిక వ‌ర్గానికి (ఓబీసీ)చెందిన‌ అమిత్ పాలేక‌ర్ వృత్తి రీత్యా అడ్వ‌కేట్‌. భండారి సామాజిక వ‌ర్గానికి చెందిన‌వార‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు ప‌థ‌కాల‌తో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్లుతోంది. గోవాలోనూ అదే నినాదంతో ఎన్నికల్లో పోటీకి నిలవనుంది.

పనాజీ వేదికగా జరిగిన ప్రెస్ మీట్ లో గోవా రాజకీయాలు, అమిత్ పాలేకర్ ఎంపిక ఎందుకనే అంశాలపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు..అమిత్ పాలేకర్ భండారీ (ఓబీసీ) సామాజికవర్గానికి చెందిన విద్యావంతుడని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. గోవా జనాభాలో 35 శాతంగా ఉన్నప్పటికీ భండారీ కులం ఇప్పటిదాకా వంచనకు గురవుతూనే ఉందని, గోవా దశ-దిశను పూర్తిగా మార్చేయడానికే ఆ వర్గానికి చెందిన అమిత్ పాలేకర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని అన్నారు. ఆప్ కుల రాజకీయాలకు దూరమని..మిగతా రాజకీయ పార్టీలే కులాల్ని రాజకీయంగా వాడుకుంటున్నాయని అన్న కేజ్రీవాల్ అమిత్ పాలేకర్ సీఎం అభ్యర్థిగా తగినవారని అన్నారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతు..ఢిల్లీ లాగానే మంచి విద్యాసంస్థలు ఉండాలని గోవా ప్రజలు కోరుకుంటున్నారని..విద్యతో పాటు మంచి వైద్యం కోసం ఆస్పత్రులు కావాలని గోవా వాసులు కోరుతున్నారని..ఇవన్నీ అమలు కావాలంటే గోవాకు అమిత్ పాలేకర్ సీఎం కావాలని అన్నారు. సమర్థవంతమైన సీఎం ఉండాలని అటువంటి వ్యక్తే నిర్వహించగల..సామాజిక అంశాలపై చక్కటి అవగాహన కలిగిన అమిత్ పాలేకర్ ను సీఎం అభ్యర్థిగా ప్రజలు తప్పక ఆదరిస్తారని కుజ్రీవాల్ ఆశాభావం వ్యక్తంచేశారు.గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని..గోవాలో అవినీతిని పాలేకర్ రూపుమాపుతారని కేజ్రీవాల్ అన్నారు. 2021 అక్టోబర్ లోనే ఆప్ లో చేరిన అమిత్ పాలేకర్ ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ఖరారు కావడం గమనించాల్సిన విషయం.

కాగా..ఆప్ సీఎం అభ్యర్థిగా ఖరారు అయిన పాలేకర్ తన తొలి స్పీచ్ లోనే బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. పలు విమర్శలు సంధించారు. ‘గోవాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అభ్యర్థులు ఒక పార్టీతో లంచ్‌, మరో పార్టీతో టీ, ఇంకో పార్టీతో డిన్నర్ అన్నట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు రాజ్యాంగం కల్పించని హక్కు ఓటు వేసి గెలిపించాల్సిన అభ్యర్థుల గురించి తెలుసుకుని ఓటు వేయాలని కోరారు. పలు విధాలుగా మారిపోయే ఆలోచనలు కలిగినవారా మనకు కావాల్సింది?మనం కోరుకునే రాజకీయం ఇదేనా?అంటూ ప్రశ్నించారు.గోవాలో మార్పు రావాలి. మంచి స్కూళ్లు, ఆస్పత్రులు ఉండాలి. రాజకీయ నాయకులు మరింత ధనవంతులు అవతుంటే..ప్రజలు మాత్రం అంతకంతకూ పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి రాజకీయాలు మారాలని..ఢిల్లీలో ఆప్ చేసి చూపించింది..గోవాలో ఆప్ పార్టీని గెలిపిస్తే గోవాలో కూడా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. దాని కోసం మాకు ఒక్క అవకాశం కావాలంతే’అంటూ అమిత్ పాలేకర్ అన్నారు. కాగా ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న గోవాలో 40 స్థానాలున్నాయి.