African Black Wood : ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్.. బంగారంతో సమానం

ఆఫ్రికాలో ఈ బ్లాక్ వుడ్ చెట్లు అధికంగా ఉంటాయి. 25 అడుగుల నుండి 40 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ బ్లాక్ వుడ్ చెట్లు పొడి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి.

Black Wood

African Black Wood : కలపలో చాలా రకాలున్నాయి. చాలా మంది తమ అవసరాలకోసం, వివిధ రకాల కలపను వినియోగిస్తుంటారు. ఆర్ధిక స్ధోమతను బట్టి కలపను కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన కలప అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఎర్రచందనం, గంధపు చెక్క, టేకులాంటివి. అయితే వాటికంటే అత్యధిక ధరపలికే కలప ఒకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్… ఇది ఎర్రచందనం, గంధపు చెక్కల ధరకంటే చాలా ఎక్కువ. ఒకరంగా చెప్పాలంటే బంగారంతో సమానం.

ఆఫ్రికాలో ఈ బ్లాక్ వుడ్ చెట్లు అధికంగా ఉంటాయి. 25 అడుగుల నుండి 40 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ బ్లాక్ ఉడ్ చెట్లు పొడి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఆఫ్రికన్ కలతో క్లారినెట్,గిటార్, వంటి సంగీత వాయిద్యాల తయారీకి విరివిగా ఉపయోగిస్తారు. బ్లాక్ వుడ్ చెట్టు నుండి మంచి చేవతేలిన కలప రావాలంటే 60 సంవత్సరాలు పడుతుంది. బాగా డబ్బున వారు ఈ చేవ కలిగిన బ్లాక్ వుడ్ కలపను ఎక్కువ ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తారు.

దృఢమైన సామర్ధ్యాన్ని కలిగి ఉండటంతోపాటు, ఈ కలపతో తయారయ్యే వస్తువులు ఎక్కవ కాలం మన్నికగా ఉంటాయి. గృహోపకరాణాలుగా వినియోగించే ఫర్నిచర్ వంటి వస్తువులను తయారు చేయించుకునేందుకు ఈబ్లాక్ ఉడ్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ఖరీదు చాలా ఎక్కవగా ఉండటంతో సామాన్యులు దీనిని కొనుగోలు చేసే పరిస్ధితి ఉండదు. ఒక కిలో బ్లాక్ ఉడ్ ధర సుమారుగా 8వేల పౌండ్లు ఉంటుంది. అంటే అక్షరాల 7లక్షల రూపాయలన్నమాట.

కెన్యా, టాంజానియా, ఆఫ్రికన్ దేశాలలో కొందరు స్మగ్లర్ల కన్ను ఈ బ్లాక్ ఉడ్ పై పడింది. గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ ఉడ్ చెట్లను నరికి కలపను తరలించుకు పోవటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా దేశాలలో బ్లాక్ వుడ్ చెట్లు అంతరించి పోతున్న వృక్షజాతుల జాబితాలో చేరాయి.