bride-groom fire gunshots: పెళ్లిలో తుపాకి పేల్చిన కొత్త జంట.. కేసు నమోదు

తాజాగా ఒక పెళ్లి వేడుకలో తుపాకీ కాల్చిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పెళ్లి వేడుక పూర్తైన తర్వాత మొదటిసారిగా అత్తారింటికి అడుగుపెట్టింది వధువు. ఈ సందర్భంగా గృహ ప్రవేశం చేసే సమయంలో వధూవరులకు బంధువుల్లో ఒకరు తుపాకీ ఇచ్చారు.

Bride Groom Fire Gunshots

bride-groom fire gunshots: పెళ్లి వేడుకల్లో తుపాకులు కాల్చడం, కత్తులు తిప్పడం ఈ మధ్య ట్రెండుగా మారింది. ఇది చట్ట ప్రకారం తప్పు అని చెప్పినప్పటికీ చాలామంది పట్టించుకోకుండా అదే పని చేస్తూ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఒక పెళ్లి వేడుకలో తుపాకీ కాల్చిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పెళ్లి వేడుక పూర్తైన తర్వాత మొదటిసారిగా అత్తారింటికి అడుగుపెట్టింది వధువు. ఈ సందర్భంగా గృహ ప్రవేశం చేసే సమయంలో వధూవరులకు బంధువుల్లో ఒకరు తుపాకీ ఇచ్చారు. వరుడు ఆ తుపాకీ తీసుకుని వధువు చేతిలో ఉంచాడు. ఇద్దరూ కలిసి గాలిలో తుపాకీ పేల్చారు.

Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన

ఈ కాల్పుల ఘటన ఒక అపార్టుమెంట్‌లో జరిగింది. పెళ్లి వేడుకలో పాల్గొన్న బంధువుల్లో ఒకరు తన మైబైల్‌లో దీన్ని వీడియో తీశారు. తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కొత్తగా పెళ్లైన జంట ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.