Lal Darwaza : లష్కర్ బోనాలు, అమ్మా బైలెల్లినాదో

పాతబస్తీ బోనాలంటే సందడి అంతా ఇంతాకాదు. లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలను ఓల్డ్‌సిటీ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. భక్తులంతా భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని వండి.. బోనంగా సమర్పిస్తారు. తమను చల్లంగా చూడాలని భక్తులు మొక్కులు మొక్కుతారు.

Lal Darwaza Bonalu 2021 : పాతబస్తీ బోనాలంటే సందడి అంతా ఇంతాకాదు. లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలను ఓల్డ్‌సిటీ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. భక్తులంతా భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని వండి.. బోనంగా సమర్పిస్తారు. తమను చల్లంగా చూడాలని భక్తులు మొక్కులు మొక్కుతారు. పాతబస్తీలోని అక్కన్న – మాదన్న టెంపుల్‌లో తొలుత బలిగంప పూజ నిర్వహిస్తారు. లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ ఉంటుంది. గతేడాది కోవిడ్‌ కారణంగా భక్తులు బోనాలు ఉత్సవాన్ని ఎవరికి వారే ఇంట్లోనే జరుపుకున్నారు. ఈసారి ప్రభుత్వం అనుమతించడంతో… సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.

Read More : CBSE : ఫలితాల్లో సత్తాచాటిన ముద్దుగుమ్మ

పాతబస్తీ బోనాలకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 8వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు… పాతబస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా పోలీస్‌ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేలా పోలీసులు నిఘా పెట్టారు. నేడు బోనాలు, రేపు రంగం కార్యక్రమం ఉండడంతో పోలీసులు రెండు రోజులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీ బోనాల కోసం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రెండు రోజులపాటు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు వెల్లడించారు. అమ్మవారి ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయన్నారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుపుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Read More : MLA Comment: ‘ఎలక్ట్రిసిటీ వద్దు.. నాకు ఎమ్మెల్యే కావాలి’ అడిగిన మహిళకు ఎమ్మెల్యే రిప్లై

ట్రెండింగ్ వార్తలు