Allari Naresh Itlu Maredumilli Prajaneekam Trailer Very Impressive
Itlu Maredumilli Prajaneekam Trailer: టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. నరేశ్ నటించిన ‘నాంది’ సినిమా దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా కంటెంట్, అందులో ఆయన నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు మరోసారి అలాంటి సీరియస్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లరి నరేశ్.
Itlu Maredumilli Prajaneekam: ఒకరోజు ముందే థియేటర్లలో వచ్చేస్తున్న మారుడమిల్లి ప్రజానీకం ట్రైలర్..!
‘‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏఆర్.మోహన్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఓ ఎన్నికల అధికారిగా అల్లరి నరేశ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటినీ క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌లో ఓ గిరిజిన ప్రాంతంలో ఉండే ఊరిలో ఎన్నికల కోసం అల్లరి నరేశ్ అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడి పరిస్థితులు, అక్కడి ప్రజలను కేవలం ఓట్లుగానే చూస్తున్న సమాజంలో మార్పు తెచ్చేందుకు అల్లరి నరేశ్ ఏం చేశాడనేది మనకు సినిమా కథగా చూపించబోతున్నారు.
Itlu Maredumilli Prajaneekam: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ముగించేశారు!
ఈ సినిమాలో అల్లరి నరేశ్‌తో పాటు ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తుండగా, జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.