Allu Arjun Tested Negative For Covid After 15 Days Of Home Quarantine
Allu Arjun Tested Negative: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నారు.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు. హోమ్ క్వారంటైన్ అనంతరం టెస్ట్ చేయించుకోగా కోవిడ్ నెగిటివ్ వచ్చిందంటూ బన్నీ పోస్ట్ చేశారు.
Allu Arjun Tested Positive : ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..
‘15 రోజుల హోమ్ క్వారంటైన్ తర్వాత నెగిటివ్ వచ్చింది..నాగురించి ప్రేయర్స్ చేసిన ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్స్.. ఈ సందర్భంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
బన్నీ ప్రస్తుతం బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ లో నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇటీవల రిలీజ్ చేసిన ‘పుష్పరాజ్’ ఇంట్రో వీడియో తక్కువ టైంలో 50 మిలయన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేసింది..
Hello everyone ! I have tested negative. I am doing well. Thank you all for the love. pic.twitter.com/srRB07Q3r3
— Allu Arjun (@alluarjun) May 12, 2021