Allu Arjun Tested Positive : ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..

తాజాగా తనకు కరోనా సోకినట్లు ‘‘ఐకాన్ స్టార్’’ అల్లు అర్జున్ ట్విట్టర్‌ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. స్వల్ప లక్షణాలుండడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. అభిమానులు శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని బన్నీ ట్వీట్ చేశారు..

Allu Arjun Tested Positive : ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..

Allu Arjun Tested Positive

Updated On : April 28, 2021 / 6:07 PM IST

Allu Arjun Tested Positive: సామాన్యుడు, సెలబ్రిటీ అని వైరస్‌కి వేరియేషన్ ఏం తెలుస్తుంది.. మహమ్మారి సెకండ్ వేవ్‌లో చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోంది.. క్షణ క్షణం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రియల్ హీరో సోనూ సూద్ కరోనా బారినపడి కోలుకున్నారు..



తాజాగా తనకు కరోనా సోకినట్లు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ట్విట్టర్‌ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. స్వల్ప లక్షణాలుండడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. అభిమానులు శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని బన్నీ ట్వీట్ చేశారు..

Pushpa Raj : రిలీజ్‌కి ముందే రికార్డ్.. పుష్ప.. ‘తగ్గేదే లే’…



‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత ల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో నటిస్తున్నారు.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నుండి బన్నీ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ‘పుష్ప రాజ్’ ఇంట్రో వీడియో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది..