Amazon Offers
Amazon Offers: అమెజాన్ ఇండియాలో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ అందించే ఈ ఆఫర్ ఆగస్టు 19న ముగుస్తుంది. అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ పలు కంపెనీల మొబైల్ ఫోన్లను డిస్కౌంట్ ధరలకు అందించే ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ తీసుకురాగా సిటీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. OnePlus 9R 5G, OnePlus Nord 2, Redmi Note 10 సిరీస్, Redmi 9 సిరీస్, Mi 11X సిరీస్, Samsung M21 2021 ఎడిషన్, Samsung M32, Samsung M31తో పాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ అందించనుంది.
దీంతో పాటు అమెజాన్ ఇండియాలో ప్రైమ్ యూజర్ల కోసం కొత్తగా ‘అడ్వాంటేజ్ – జస్ట్ ఫర్ ప్రైమ్’ అనే ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది. సేల్ కొనసాగే సమయంలో HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై వినియోగదారులకు అతి తక్కువ వడ్డీ లేని వాయిదాలను పొందడానికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్ లో వాయిదాలపై కనీసం మూడు నెలల ఇన్ స్టాల్మెంట్స్ కలిగి ఉండేలా అందించనుండగా.. ఈ ఆఫర్‌లో Samsung, Redmi, Mi, iQOO, Oppo, vivo వంటి మొబైల్స్ ఉంటాయి.
అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ ఆఫర్లను చూస్తే..
Amazon Offers
OnePlus 9 5G
రూ.49,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడిన.. OnePlus 9 5G ఇప్పుడు ఒక సాధారణ అమెజాన్ కూపన్‌ను వర్తింపజేయడం ద్వారా రూ.4,000 తగ్గింపుతో రూ .45,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Amazon Offers
Samsung Galaxy M31
Galaxy M31 6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,999కి లాంచ్ చేయబడగా.. ఇది ఇప్పుడు రూ.14,999కి అందుబాటులో ఉంటుంది.
Amazon Offers
Oppo F17
Oppo F17 ప్రారంభ ధర రూ.17,990తో ప్రారంభించబడగా ఇప్పుడు అమెజాన్‌లో రూ.14,990కి అందుబాటులో ఉంది.
Amazon Offers
Samsung Galaxy M42 5G
రూ.21,999 ప్రైస్ ఉన్న Galaxy M42 5G ఇప్పుడు రూ.20,999కి అందుబాటులో ఉంది. అమెజాన్ కూపన్ అప్లై చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందవచ్చు.
Amazon Offers
Mi 10T 5G
రూ.34,999 ప్రారంభ ధరలో లాంచ్ చేయబడిన Mi 10T 5G ప్రస్తుతం రూ.2,000 తగ్గిపోయి రూ.32,999కి అందుబాటులో ఉంది.