Amazon : అమెజాన్ ప్రైమ్ డే సేల్ భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు..ఎప్పుడంటే..
ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్ స్పీకర్లు, కిండిల్, ఫైర్ టివి, స్మార్ట్ డిస్ ప్లే వంటి వాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 20, 2021 / 05:01 PM IST
Amazon
Amazon : అమెజాన్ త్వరలో ప్రైమ్ డే సేల్ పేరుతో ఆఫర్ల మోత మోగించబోతుంది. జులై 26,27 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ప్రైమ్ డే సేల్ ను సద్వినియోగం చేసుకునేందుకు ఎంతో మంది కొనుగోలు దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్ స్పీకర్లు, కిండిల్, ఫైర్ టివి, స్మార్ట్ డిస్ ప్లే వంటి వాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంది. అమెజాన్ ఫైర్ స్టిక్ ధర సాధారణంగా 3999 రూపాలు ఉండగా డిస్కౌంట్ సేల్ లో దానిని 2999 రూపాయలకు పొందవచ్చు. ఫైర్ టివి 4కె స్టిక్ 3999 రూపాయల ధరకే లభిస్తుంది. ఇక స్మార్ ఎల్ ఈ డీ టీవీలు అసలు ధరకంటే తక్కువ ధరలతో కొనుగోలు చేయవచ్చు.
రెండు రోజుల పాటు అమెజాన్ భారీ డిస్కౌంట్లతో ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్న నేపధ్యంలో చాలా మంది ప్రైమ్ మెంబర్స్ గా చేరేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ గా చేరిన వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
