AMB Cinemas : AMB సినిమాస్ నిలిపివేత.. కృష్ణ గారి మృతికి సంతాపం..

టాలీవుడ్ ప్రముఖ నటుడు కృష్ణ గారు 79 ఏళ్ళ వయసులో కన్నుమూసారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవాల్సి ఉండగా.. నిన్న కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిని చూసి పోస్ట్ పోన్ చేసుకున్నారు. తాజాగా AMB సినిమాస్...

AMB Cinemas Closed today due to sudden death of krishna

AMB Cinemas : టాలీవుడ్ ప్రముఖ నటుడు కృష్ణ గారు 79 ఏళ్ళ వయసులో కన్నుమూసారు. అత్యవసర చికిత్స పరిస్థితిలో హైదరాబాద్‌ కాంటినెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు కృష్ణ. అవసరమైన వైద్యం అందించినప్పటికీ.. కృష్ణ గారు ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Super Star Krishna : కృష్ణ తుదిశ్వాస ప్రశాంతంగా విడిచేందుకు చికిత్స నిలిపివేత.. కుటుంబసభ్యుల నిర్ణయం!

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవాల్సి ఉండగా.. నిన్న కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిని చూసి పోస్ట్ పోన్ చేసుకున్నారు. తాజాగా AMB సినిమాస్ యాజమాన్యం కూడా కృష్ణ గారి గౌరవార్థం ఈరోజు మాల్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. స్టాఫ్ అంతా ఘట్టమనేని కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.

కాగా కృష్ణ గారి పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి ‘నానక్‌రామ్‌గూడ’లోని కృష్ణ ఇంటి వద్దకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కృష్ణ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు. కృష్ణ అంతిక్రియలు గురించి కూడా వెల్లడించారు కుటుంబసభ్యులు. రేపు అష్టమి కావడంతో, ఎల్లుండి అంతిక్రియలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.