Railway Cop Saves Elderly Woman: కదిలే రైలెక్కుతుండగా జారిపడ్డ వృద్ధ మహిళ, కుమారుడు.. కాపాడిన మహిళ పోలీస్ .. వీడియో వైరల్

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి అప్రమత్తత పశ్చిమ బెంగాల్‌లోని బంకురా రైల్వే స్టేషన్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు ప్రాణాలను కాపాడింది.

Railway Cop Saves Elderly Woman: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి అప్రమత్తత పశ్చిమ బెంగాల్‌లోని బంకురా రైల్వే స్టేషన్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు ప్రాణాలను కాపాడింది. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ఆ ఇద్దరు రైలు పట్టాల కింద నుజ్జునుజ్జు అయ్యేవారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే ప్రసగిట్టిన రైల్వే మహిళ పోలీస్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఇద్దరిని కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తన ట్వీట్‌లో, మంత్రిత్వ శాఖ కూడా మహిళా పోలీస్ ను ప్రశంసించింది.

Viral Video : రాజకీయ నాయకుడి కారుని ఈడ్చుకెళ్లిన లారీ

బంకురా రైల్వే స్టేషన్ లో రైలు బయలుదేరింది. ప్లాంట్ ఫాం మీద నుంచి చిన్నగా ముందుకు కదులుతుంది. ఈలోపు ఓ వృద్ధ మహిళ, ఆమె కొడుకు పరుగు పెట్టుకుంటూ వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. రైలు ఎక్కుతున్న సమయంలో వృద్ధ మహిళ ఒక్కసారిగా జారిపడిపోయింది. అయితే వీరు రైలుకోసం పరుగెడుతుండగా గమనించిన మహిళా RPF అధికారి వారిని అనుసరిస్తూ ముందుకు పరుగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. మహిళా పోలీస్ ఊహించినట్లుగానే వృద్ధ మహిళ, బాలుడు ఒక్కసారిగా కిందపడటం వెంటనే వారిని అందుకొని బయటకు లాగడంతో వారి ప్రాణాలను కాపాడింది.

ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి శాఖ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే ప్రయాణీకులు కదులుతున్న రైలులో ఎక్కవద్దని, దిగవద్దని కోరింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసినప్పటి నుండి 28,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. వందలాది మందికి లైక్‌లు, రీట్వీట్లు చేూశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆటోమేటిక్ డోర్‌లను అమర్చాలని భారతీయ రైల్వేలకు వినియోగదారులు సూచనలు చేయగా, మరికొందరు RPF అధికారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు