Anand Mahindra: యువకుడి ప్రతిభకు ముగ్దుడైన ఆనంద్ మహింద్రా.. వీడియోను షేర్ చేసి ఆసక్తికర ట్వీట్

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా ట్విటర్‌లో క్రమం తప్పకుండా ఆసక్తికర విషయాలతో కూడిన పోస్టులు చేస్తుంటాడు. వినూత్న ఆవిష్కరణలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఒక్కోసారి వారికి అవసరమైన సహాయాన్ని కూడా ఆనంద్ మహింద్రా అందిస్తుంటాడు. తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశాడు.

Anand Mahindra

Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా ట్విటర్‌లో క్రమం తప్పకుండా ఆసక్తికర విషయాలతో కూడిన పోస్టులు చేస్తుంటాడు. వినూత్న ఆవిష్కరణలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఒక్కోసారి వారికి అవసరమైన సహాయాన్ని కూడా ఆనంద్ మహింద్రా అందిస్తుంటాడు. తాజాగా మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఆటోమోటివ్ ఆర్టిస్ట్ క్రిస్ డన్‌లాప్ అనే యువకుడు అవలీలగా పెయింట్ వేస్తున్నట్లు ఉంది. పేపర్ పై కారుబొమ్మలను వేస్తూ, వాటికి ఆకట్టుకునేలా పెయింట్ వేస్తున్నాడు.

Anand Mahindra : దుబాయిలో హిందూ ఆలయాన్ని సందర్శించుకున్న ఆనంద్ మహీంద్రా..

ఈ వీడియోను చూసి ముగ్ధుడైన ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. SUVలలో ఒకదానిని పెయింట్ చేయడానికి క్రిస్‌ని తప్పక ఒప్పించాలని అని రాశాడు. షేర్ చేసిన వీడియోలో క్రిస్ ఛాయాచిత్రాల నుండి తన పెయింటింగ్‌లను వేయడం మనం చూడొచ్చు. తన కళను తన ఊహ, సహజత్వానికి వదిలివేయడానికి ఇష్టపడతానని క్రిస్ చెప్పాడు. అయినప్పటికీ, అతని పెయింటింగ్‌లను చూస్తే, అవి ప్రణాళిక లేకుండా స్వేచ్ఛగా గీశాయని నమ్మడం కష్టం. క్రిస్ తన పెయింటింగ్స్ చాలా గజిబిజిగా ప్రారంభమవుతాయని చెప్పాడు. అయితే అతని బ్రష్ స్ట్రోక్‌లు పెయింటింగ్‌లకు ప్రాణం పోస్తాయి.

మహీంద్రా ట్వీట్‌కు గంట వ్యవధిలో వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. అనేక మంది నెటిజన్లు క్రిస్ ఏ వాహనానికి పెయింట్ వేయాలి అనే దానిపై వారి సూచనలను పంచుకున్నారు. మహీంద్రా యొక్క ఫ్లాగ్‌షిప్ SUV, XUV 700, మహీంద్రా థార్ అత్యంత ప్రజాదరణ పొందిన వాటిని పెయింటింగ్ వేయించాలని నెటిజన్లు మహింద్రాకు సూచనలు చేశారు. కొంతమంది పాతకాలపు క్లాసిక్ మహీంద్రా విల్లీస్‌కు కళాకారుడి నుండి పెయింట్ వేయించాలని సూచించారు.