Anchor Anasuya: ఆ దర్శకుడితో రిలేషన్ గురించి రివీల్ చేసిన అనసూయ!

యాంకర్లలో ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ క్రియేట్ చేసుకొని దున్నేయడం ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్నదే. అప్పుడు ఉదయభాను.. ఇప్పుడు సుమ, అనసూయ, రష్మీ ఇలా కొంతమంది ఎవరికి వారు తనదైన స్టైల్ తో అలరిస్తూ వస్తున్నారు. వీరిలో అనసూయ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Anchor Anasuya: యాంకర్లలో ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ క్రియేట్ చేసుకొని దున్నేయడం ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్నదే. అప్పుడు ఉదయభాను.. ఇప్పుడు సుమ, అనసూయ, రష్మీ ఇలా కొంతమంది ఎవరికి వారు తనదైన స్టైల్ తో అలరిస్తూ వస్తున్నారు. వీరిలో అనసూయ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు వెండితెర మీద సినిమాలో మాత్రమే ఉండే గ్లామర్ టచ్ బుల్లితెరకు పరిచయం చేసిన క్రెడిట్ అనసూయకు దక్కుతుంది. ఆ దారిలోనే ఇప్పుడు చాలామంది వెండితెరను మించి అందాలు ఒలకబోస్తున్నారు.

కాగా, అనసూయ ఒకవైపు యాంకరింగ్ తో పాటు మరోవైపు వెండితెర మీద కూడా రాణిస్తుంది. ప్రత్యేక గీతాల నుండి ప్రత్యేక పాత్రల వరకు అన్నిటిలో కనిపించిన అనసూయ రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో స్టార్ డం పెంచేసుకుంది. ఇంకా చెప్పుకోవాలంటే రంగమ్మత్త పాత్ర అనసూయ హాట్ ఇమేజ్ కు తోడు మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సరిగా ఈ సినిమాతోనే అనసూయకు ఓ దర్శకుడితో మంచి స్నేహం ఏర్పడిందట. ఆ దర్శకుడు ఎవరో కాదు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన.

దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడే కాగా రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ దర్శకుడు కూడా. ఈ సినిమా సమయంలో యూనిట్ మొత్తం అనసూయను రంగమ్మత్త అంటూ పిలవగా అలానే పిలుస్తూ అనసూయకు దగ్గరైన బుచ్చిబాబు ఇప్పటికీ అంతే స్నేహంగా మెలుగుతున్నాడట. బుచ్చిబాబు నా పర్సనల్‌ విషయాలు కూడా షేర్‌ చేసుకునేంత మంచి స్నేహితుడయ్యాడని.. ఇండస్ట్రీలో నాకంత క్లోజ్‌ అయిన వ్యక్తి కూడా బుచ్చినే అని అనసూయ కూడా చెప్పేస్తుంది. ఉప్పెన షూటింగ్ సమయంలో తన ఇంటి దగ్గర్లో షూటింగ్ జరుగుతుండగా అనసూయ షూటింగ్ స్పాట్ కి వెళ్లి సెట్లోనే ఉన్న అక్కడే విజయ్‌ సేతుపతితో ముచ్చట్లు పెట్టిందట.

ట్రెండింగ్ వార్తలు