Anchor Meghana: మెగా ఫ్యామిలీ కోడలిగా మారుతున్న యాంకర్ మేఘన
బుల్లితెరపై యాంకర్‌గా తనదైన స్టయిల్, క్రేజ్ సాధించిన అందాల భామ మేఘన ఇటీవల వరుసగా పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. అయితే గతకొంత కాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా యాంకర్ మేఘన తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
- Anil Aaleti
- Updated on- August 12, 2022 / 05:06 PM IST
Anchor Meghana Gets Engaged To Pavan Tej
Anchor Meghana: బుల్లితెరపై యాంకర్‌గా తనదైన స్టయిల్, క్రేజ్ సాధించిన అందాల భామ మేఘన ఇటీవల వరుసగా పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. అయితే గతకొంత కాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా యాంకర్ మేఘన తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతకీ మేఘన ఎవరితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది అనుకుంటున్నారా.. మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరోతో మేఘన ఎంగేజ్‌మెంట్ జరిగింది.
పవన్ తేజ్: కొణిదెల కుటుంబం నుంచి కొత్త హీరో
మెగా ఫ్యామిలీకి చెందిన అప్‌కమింగ్ హీరో పవన్ తేజ్ కొణిదెలను గతకొంత కాలంగా ప్రేమిస్తోంది యాంకర్ మేఘన. అయితే తాజాగా వీరిద్దరికీ నిశ్చితార్థం చేశారు ఇరువురి కుటుంబ సభ్యులు. వీరి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు. ఈ జంటకు నిశ్చితార్థం సందర్భంగా ఆమె ఆశీస్సులు అందించారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి పలువురు సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.
చిరుకు సోదరుడి కుమారుడైన పవన్ తేజ్ కొణిదెలతో మేఘన నిశ్చితార్థం జరగడంతో, ఈ బుల్లితెర యాంకర్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కోడలిగా మారనుంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా, మేఘన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
