Anchor Pradeep: కన్నుమూసిన యాంకర్ ప్రదీప్ తండ్రి.. విషాదంలో కుటుంబం..!
ప్రముఖ టీవీ యాంకర్, నటుడు ప్రదీప్‌కు పితృవియోగం కలిగింది. ప్రదీప్ తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతుండగా శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
- Naresh Mannam
- Published On : May 2, 2021 / 11:30 AM IST
Anchor Pradeep
Anchor Pradeep: ప్రముఖ టీవీ యాంకర్, నటుడు ప్రదీప్‌కు పితృవియోగం కలిగింది. ప్రదీప్ తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతుండగా శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఇదే సమయంలో ఆయన కరోనాతో పోరాడి మరణించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన కరోనాతో మరణించారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మరణించారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక, కరోనా ఆంక్షల కారణంగా ఆయన అంత్యక్రియలకు పెద్దగా ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తుంది.
ఇక మరోవైపు ప్రదీప్ కు కరోనా సోకిందని ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదని వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై ఆయన స్పందించకపోగా ఫ్యాన్స్ మాత్రం ప్రదీప్ ఆరోగ్యం ఎలా ఉందో అంటూ అందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా యాంకర్ ప్రదీప్ ఏ షోలలో కనిపించడం లేదు. కరోనా వలన ప్రదీప్ షోస్‌కు హాజరు కావడం లేదని ప్రచారం కూడా జరుగుతుంది. ప్రదీప్ స్థానంలో యాంకర్ రవి పలు కార్యక్రమాలను హోస్ట్ చేస్తున్నాడు. ఈలోగా ప్రదీప్ తండ్రి మరణ వార్త వినాల్సి వచ్చింది.
ఇక టీవీల్లో టాప్ యాంకర్స్‌లో ఒకరుగా రాణిస్తున్న యాంకర్ ప్రదీప్ ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాంకర్ ప్రదీప్‌ను తెలుగువారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో తన మాటల్లో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతుంటారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ హీరోగానూ అలరించే ప్రయత్నం చేశాడు.
