annu kapoor sensational comments on aamir khan
Annu Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. సినిమా నాలెడ్జ్, సినీ పరిశ్రమలో ఉన్న ఎవరికైనా అమీర్ ఖాన్ అంటే తెలుసు, అందులోనూ బాలీవుడ్ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఈ మిస్టర్ పర్ఫెక్ట్ గురించి. కానీ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ కి అమీర్ ఖాన్ అంటే ఎవరో తెలీదంట. క్రాష్ కోర్స్ సిరీస్ ఫేమ్ నటుడు అన్ను కపూర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ నటించిన క్రాష్ కోర్స్ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అతడిని ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా గురించి అడిగారు. దీనికి అన్ను కపూర్ అసలు ఆమిర్ ఖాన్ ఎవరని తిరిగి ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా షాక్ అయ్యారు.
అసలు అమీర్ ఖాన్ తెలియనప్పుడు అతని సినిమాల గురించి ఎలా తెలుస్తాయి అని అన్నాడు. తాను సినిమాలు చూడనని, తను నటించినవి కూడా చూడనని, అందుకే నాకు సినిమా వాళ్ళ గురించి పెద్దగా తెలియదని, నిజంగానే తనకు ఆమిర్ ఖాన్ ఎవరో తెలియదని అన్ను కపూర్ అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చగా మారాయి. అన్ను కపూర్ కి నిజంగానే అమీర్ ఖాన్ ఎవరో తెలీదా, లేక కావాలని చెప్తున్నాడా అని అనుకుంటున్నారు బాలీవుడ్ వర్గాలు.