Kuno National Park : కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి..ఐదు నెలల్లో 7 చీతాల మృతి

దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చీతాల్లో మరోకటి మరణించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఉంచిన తేజస్ అనే మరో చీతా (చిరుత) మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.....

Another cheetah dies

Kuno National Park : దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చీతాల్లో మరోకటి మరణించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఉంచిన తేజస్ అనే మరో చీతా (చిరుత) మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. (Another cheetah dies) ఇప్పటికే ఈ పార్కులో మూడు చీతాలు, మరో మూడు పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి. (7th in five months)

Nabha Natesh : కొంటె చూపులు ఓపక్క.. నడుము అందాలు మరోపక్క.. నభా నటేష్ నాజూకులు!

తేజస్ చీతాకు మెడ పై భాగంలో గాయం గుర్తులు కనిపించడంతో దానికి చికిత్స చేస్తుండగా మృతి చెందింది. నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చిన చీతాలు పోరాడుతుండటంతో ఓ చీతా గాయపడింది. చీతాకు అయిన గాయానికి చికిత్స చేస్తుండగా అది మరణించిందని వన్యప్రాణి పశు వైద్యుల బృందం తెలిపింది.

Bengal Panchayat Polls: బీజేపీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ స్థానాలు గెలిచిన టీఎంసీ

సోమవారం ప్రభాస్, పావక్ అనే రెండు మగ చిరుతలను అడవిలోకి వదిలినట్లు షియోపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పికె వర్మ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలను కునో నేషనల్ పార్కులో (Kuno National Park) వదిలివేశారు. గడచిన ఐదు నెలల్లో ఏడు చీతాలు మరణించడం కలకలం రేపింది. చీతా మృతికి కారణాలు పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని పశువైద్యులు చెప్పారు.