Agnipath: అందుకే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: కేంద్ర మంత్రి నఖ్వీ
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనల వెనుక కొందరి కుట్రలు ఉన్నాయని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న వైఖరే వారు కుట్రలు పన్నడానికి కారణమని చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : June 18, 2022 / 05:32 PM IST
Naqvi
Agnipath: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనల వెనుక కొందరి కుట్రలు ఉన్నాయని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న వైఖరే వారు కుట్రలు పన్నడానికి కారణమని చెప్పారు.
Agnipath : అగ్నిపథ్ ఆందోళనలు.. రద్దైన రైళ్ల వివరాలు
”ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసే పక్షపాత వైఖరిగల కొందరికి ఆయనపై ‘పొలిటికల్ ఎలర్జీ పిచ్చి’ ఉంది. దాన్నే ఇప్పుడు దేశ యువ శక్తిపై కుట్రలు పన్నడానికి బదలాయించారు. అయినప్పటికీ, ఏది ఏమైనా ఇటువంటి కుట్రలను సఫలం కానివ్వం. యువతలో ఉన్న సానుకూల దృక్పథంతో కూడిన శక్తి, జాతీయవాదంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విషయంలో యువతలో ఎటువంటి గందరగోళమూ ఉండవద్దు” అని ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు.
